Hyderabad Rain: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం వరకు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మియాపూర్, మదీన గూడ, నిజాంపేట్, నిజాంపేట్ ఎక్స్ రోడ్, కూకట్ పల్లి, జేఎన్టీయూ, కేపీహెచ్పీ, హైటెక్ సిటీ మాదాపూర్, మోతీనగర్, బొరబండ, ఎస్సాఆర్ నగర్, రహ్మత్ నగర్ లో ఎర్రగడ్డలో వర్షం కురుస్తోంది.
శేరిలింగంపల్లి, పటాన్ చెరు, అమీన్పూర్ బిహెచ్ఎల్ ప్రాంతాల్లో వాన కొడుతుంది. బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లోనూ వర్షం పడుతుంది. భారీ గాలులు వీస్తుండడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది.

అధికారులను అప్రమత్తం చేసింది. ఎక్కడెక్కడ వర్షం పడుతుందో అధికారులు తెలుసుకుంటున్నారు. వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మే 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది మే 24 వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వర్షలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉందని వివరించింది.












Click it and Unblock the Notifications