కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం.. ఆ మందు తన వద్ద ఉంది: జగ్గారెడ్డి..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించే మెడిసిన్ తన దగ్గర ఉందని కామెంట్స్ చేశారు. ఇవీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తాను మాట్లాడేది కామెడీ కాదని, సీరియస్‌గా చెబుతున్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పీసీసీ చీఫ్ ఎంపిక జాబితాలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై విరుచుకుపడ్డారు.

Recommended Video

    TS Formation Day 2021: అప్పుల రాష్ట్రంగా మార్చారు.. ఏడేళ్లుగా భ్రమలు కల్పించారన్న Jaggareddy
    పీసీసీ పోస్ట్ కోసం

    పీసీసీ పోస్ట్ కోసం

    పీసీసీ కావాలని అడుగుతున్నా.. స్పందించడం లేదని జగ్గారెడ్డి అన్నారు. ఢిల్లీ చర్చలో లేనని.. అది తన దురదృష్టం అని అభిప్రాయపడ్డారు. తనను ఠాగూర్ చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బలమైన నాయకుడిగా ఠాగూర్ తనను గుర్తించకపోవడం దురదృష్టం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో బాంబే హైవే మీద కేసీఆర్‌ను అడ్డగించిన చరిత్ర నాది అన్నారు. ఇది ఠాగూర్‌కు తెలియక పోవడం విచారకరం అని అభిప్రాయపడ్డారు.

     కేసీఆర్‌కు సమ ఉజ్జీ

    కేసీఆర్‌కు సమ ఉజ్జీ

    రాజకీయంగా కేసీఆర్‌ను అడ్డుకోవడం తనతోనే సాధ్యం అని జగ్గారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దింపే మెడిసిన్ తన వద్ద ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ఇదీ సీరియస్ అని స్పస్టంచేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇక వీహెచ్‌ను కొందరు బెదిరించడం సరికాదన్నారు. బెదిరించేవారు ఫోన్ నంబర్ పెట్టాలని.. తాను వచ్చి మాట్లాడతానని పేర్కొన్నారు. ఫేస్ బుక్‌లో పిచ్చిగా మాట్లాడితే దానికి తగ్గట్టుగా రియాక్షన్ ఉంటుంది అని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    హాట్ కామెంట్స్

    హాట్ కామెంట్స్

    సీఎం కేసీఆర్ లక్ష్యంగా జగ్గారెడ్డి ఫైర్ అవుతుంటారు. కానీ ఈసారి గద్దె దించే మెడిసిన్ తన వద్ద ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ఇదీ పెను దుమారం రేపనుంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దానికి దారితీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తనను బలమైన నేతగా గుర్తించలేదని జగ్గారెడ్డి అంటున్నారు. అందులో భాగంగానే కామెంట్ చేశారా..? లేదంటే మరో కోణం ఉందో తెలియాలంటే మరికొద్దీరోజులు ఆగాల్సిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+