7వ తేదీన ముహూర్తం: రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు చేయిచ్చి, బీజేపీలో చేరేది ఆ రోజు

రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ఖాయమైంది. కాంగ్రెస్ పార్టీని వీడొద్దని నేతలు బుజ్జగించిన ఫలితం లేదు. ఏం కావాలని దిగ్గీ రాజా అడిగిన రాజగోపాల్ రెడ్డి ససేమిరా అన్నారు. ఢిల్లీ రావాలని కోరిన స్పందించలేదు. పార్టీ మార్పునకు సంబంధించి తన అనుచరులు, శ్రేయోభిలాషితో చర్చించినట్టు సమాచారం. బీజేపీ కూడా ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి పోటీ చేయాలని షరతు విధించింది. దానికి సంబంధించి సంప్రదింపులు కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది.

ముహూర్తం ఖరారు..

ముహూర్తం ఖరారు..


ఆగస్టు 7వ తేదీన హస్తానికి హ్యాండివ్వనున్నారట. ఆ రోజు కాషాయ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డితో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కూడా చర్చలు జరిపినా ససేమిరా అంటున్నారు. పార్టీని వీడేందుకే మొగ్గు చూపారు. రాష్ట్ర ప్రజలు కూడా మునుగోడు ఉపఎన్నికే కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఉపఎన్నికతో మునుగోడును డెవలప్ చేయడం, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడమే తన ఎజెండా అన్నారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మునుగోడులో పర్యటిస్తానని తెలిపారు.

రేవంత్ రియాక్షన్

రేవంత్ రియాక్షన్


రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు కంచుకోట అని.. దాన్ని కాపాడుకుంటామని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం.. పార్టీ అంతర్గత విషయం అని తెలిపారు. ఉత్తమ్‌ సహా పార్టీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. చిన్న చిన్న అంశాలపై మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని రేవంత్‌ చెప్పారు.

వీడటం ఖాయం..?

వీడటం ఖాయం..?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను చేస్తోంది. రోజుకో నేత సంప్రదింపులు జరుపుతున్నారు. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మనసు మారడం లేదు. లైన్‌లోకి దిగ్గీ రాజా వచ్చిన నో యూజ్.. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత వంశీ చంద్ రెడ్డి వేర్వేరుగా సమావేశం అయ్యారు. పార్టీని వీడొద్దని ఆ ఇద్దరూ నేతలు చెప్పారు. రాజగోపాల్ రెడ్డితో మొన్న భట్టి విక్రమార్క వెళ్లి చర్చలు జరిపారు. ఆ మరునాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కూడా చర్చలు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+