kumari Auntyకి పబ్లిసిటీ చేస్తున్న మీడియా ఇజ్జత్ తీస్తున్నారుగా!!
కుమారి ఆంటీ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు లేరు. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది కుమారి ఆంటీ. తన ఫుట్ పాత్ ఫుడ్ బిజినెస్ ద్వారా హైలైట్ అయిన కుమారి ఆంటీ విషయంలో మీడియాపైన, కుమారి ఆంటీ వ్యవహారశైలిపైన ప్రస్తుతం అక్కడి స్థానికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఫుడ్ ఫేమస్ కావడంతో ఆమె ఫుడ్ టెస్ట్ చేయడం కోసం చాలా దూరప్రాంతాల నుంచి అక్కడికి వస్తున్న జనాలతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతుందని, అదే రోడ్డులో ఫుట్ పాత్ మీద ఫుడ్ స్టాల్స్ నిర్వహించుకొని జీవనం సాగిస్తున్న ఎంతోమంది స్ట్రీట్ ఫుడ్ నిర్వాహకులు కుమారి ఆంటీకి మీడియా క్రియేట్ చేసిన పబ్లిసిటీ తమ పొట్ట కొడుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. నేటికీ మౌలిక వసతులు లేని ఎన్నో గ్రామాలు ఇబ్బందులకు గురవుతుంటే... ప్రజల సమస్యలను పక్కనపెట్టి కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ గురించి మీడియా చేస్తున్న పబ్లిసిటీపై మండిపడుతున్నారు. మీడియావాళ్ళు ఇక్కడకు ఎవరు రావద్దని, ఆమెని హైలైట్ చేయొద్దని, మిగతావాళ్ళు బతకాలి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని స్థానికవ్యాపారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి వస్తున్న మీడియా వారిని నిలదీస్తున్నారు. మీడియా చేయాల్సింది కుమారి ఆంటీ చికెన్ కూర బాగుంది, చింతకాయ పచ్చడి బాగుంది అన్న ప్రచారం కాదని సామాన్య మహిళలు మీడియాను తూర్పార పడుతున్నారు. రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటూ బతికే వాళ్ళను కుదురుగా వ్యాపారాలు చేసుకోవ్వకుండా కుమారి ఆంటీ కి ఎందుకు ఇంత పబ్లిసిటీ చేస్తున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు.
Adhi aunty... Atla mingu💥
— OG💥udaypatel45 (@alwaysudaypatel) February 4, 2024
Koncham ina izzath osthadhi #KumariAunty pic.twitter.com/ztGJPLzFOY
ఆమె ఇంటికి వెళ్లి మరీ వీడియోలు చేసి, ఆమె ఫుడ్ బిజినెస్ పబ్లిసిటీ చేస్తున్న మీడియా ఎంతమంది బ్రతుకులను బజారుకి ఈడుస్తుందో అర్థం చేసుకోవడం లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇక కుమారి ఆంటీ గురించి ఇదేవిధంగా పబ్లిసిటీ చేస్తే భవిష్యత్తులో అక్కడ స్థానికంగా వ్యాపారం చేసుకునే వారు తిరగబడి కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీడియాపై నిప్పులు చెరిగిన ఒక మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆమె చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని ప్రతి ఒక్కరు చర్చించుకునేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications