Hyderabad: శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయం పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించారు. విమానాశ్రయ పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందనే సమాచారాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు అందించారు.
విమానాశ్రయం వద్దకు చేరుకున్న వన్యప్రాణి విభాగం సిబ్బంది, జూ అధికారులు చిరుత కోసం పరిసర ప్రాంతాలు గాలింపు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్ పోర్ట్ ప్రహారీ నుంచి చిరుత దూకిందని తెలిసింది. దీంతో చిరుతతోపాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.

ఎయిర్ పోర్ట్ ప్రహారీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూంలో అలారం మోగింది. దీంతో కంట్రోల్ రూం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతోపాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు అక్కడి కెమెరాల్లో రికార్డయ్యింది.
అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుతలను బంధించేందుకు బోన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు మూైడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ చిరుత విమానాశ్రయం గోడ దూకినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. తాజాగా, మరోసారి చిరుత సంచారంతో విమానాశ్రయ సిబ్బందితోపాటు స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications