హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. కానీ ఆ షరతు, మాస్క్ మ్యాండెటరీ.. లేదంటే ఫైన్ వాత

|
Google Oneindia TeluguNews

టీఎస్ ఆర్టీసీ పలు విప్లవాత్మక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికుల మేలు కోరి యాక్షన్ చేపడుతుంది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మీ ఇంటి వద్దకే బస్సు సర్వీస్ అందజేయనుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్ చేయడమే.. అంతే మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు వస్తోంది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయాణికులు కోరిన చోట బస్సును ఆపి ఎక్కించుకోవడం, దించడం చేసిన ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసింది.

ఇంటి వద్దకే బస్సు..

ఇంటి వద్దకే బస్సు..

ప్రయాణికుల ఇంటి వద్దకే సేవలందించేదుకు రెడీ అయ్యింది. సంక్రాంతికి ఊరు వెళ్లే ప్రయాణికులు ఒకే ప్రాంతంలో 30 మంది ఉంటే.. వారి ప్రాంతం, వారి కాలనీకి బస్సును పంపిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందుకోసం ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో గల ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పిస్తున్నామని ట్వీట్ చేశాపారు. సమచారం కోసం ఎంజీబీఎస్ : 9959226257, జేబీఎస్ : 9959226246, రేతిఫైల్ బస్ స్టేషన్ 9959226154, కోఠి బస్ స్టేషన్ : 9959226160 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

స్పెషల్ సర్వీసులు

స్పెషల్ సర్వీసులు

సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఊరికి వెళ్లే వారి కోసం టీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు నడుపుతోంది. జనవరి 7 నుంచే బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 15 వరకు స్పెషల్‌ బస్సులను తిప్పనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. సంక్రాంతికి మొత్తం 4వేల 318 బస్సులను టీఎస్‌ ఆర్టీసీ నడపనుంది. రాష్ట్రంలోని జిల్లాలకు 3వేల 334 స్పెషల్‌ బస్సులను నడపనుంది. ఇక ఏపీకి మరో 984 సర్వీసులు తిప్పనుంది. ఈసారి చార్జీల విషయంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ కాస్త ఊరట ఇచ్చింది. సాధారణ చార్జీలు తీసుకుంటామని తెలిపిన సంగతి తెలిసిందే.

నో ఎక్స్‌ట్రా చార్జెస్ట్

నో ఎక్స్‌ట్రా చార్జెస్ట్


పండుగకు తిప్పే స్పెషల్‌ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. దీంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించే అవకాశం ఉంది. పండుగ కోసం ఊళ్లకు వెళ్లేవారిని తమ బస్సుల్లో ఎక్కించేలా ఆర్టీసీ ప్లాన్‌ చేసింది. ఏపీకి తిప్పే బస్సుల్లోనూ టీఎస్ఆర్టీసీ సాధారణ చార్జీలే వసూలు చేయనుంది. దీంతో సంక్రాంతి పండుగను కుటుంబంతో జరుపుకోవడానికి సొంతూళ్లకు వెళ్లే ఏపీ ప్రజలు కూడా టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. సంక్రాంతికి అదనపు చార్జీలు వసూల్ చేస్తామని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. దానిని చూస్తే టీఎస్ ఆర్టీసీ మేలే అనిపిస్తోంది.

మాస్క్ లేకుంటే ఫైన్

మాస్క్ లేకుంటే ఫైన్

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠినంగా ఉంటామని ఆర్టీసీ స్పష్టం చేసింది. పండగకు ఊర్లకు వెళ్లేవారు విధిగా మాస్క్ ధరించాలని స్పష్టంచేసింది. లేదంటే రూ.50 ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఇదీ సిటీ, జిల్లాల్లో వెళ్లే అందరికీ వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

English summary
who want bus tsrtc send home to service. but 30 people compulsory rtc md sajjanar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X