Hyderabad: మీకు కంపెనీలు సెలవులు ఇవ్వడం లేదా.. !
హైదరాబాద్ లో పని చేస్తున్న చాలా మంది ఉద్యోగులు తమ చట్టబద్దమై సెవులు, వీక్లి ఆఫ్ లేకుండా కూడా పని చేస్తున్నారు. వెయిటర్స్ నుంచి నిర్మాణ కూలీలు, సెల్స్ పర్సన్సు, చాలా మంది ఉద్యోగులకు కార్మిక చట్టాలపై అవగాహన లేదు. పెయిడ్ లీవ్ ఇస్తారని తెలియదు. వారికి ప్రశ్నించే ధైర్యం కూడా లేక పని చేసుకుంటుపోతున్నారు.

వీక్లి ఆఫ్
రాము(పేరు మార్చాం) ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఊరు నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చాడు. అమీర్ పేటలోని ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కనీసం వీక్లి ఆఫ్ కూడా ఇవ్వడం లేదని చెబుతున్నాడు. తనకి 6 నెలల క్రితమే పెళ్లి అయిందని.. తన భార్య తనతోనే సిటీకి వచ్చిందని.. కానీ తనతో గడపడానికి టైమ్ ఉండడం లేదని వాపోయాడు. ప్రస్తుతం తను వేరే ఉద్యోగం కోసం చూస్తున్నట్లు చెప్పాడు.

ఓవర్ టైమ్
తన సహచరుడు, స్నేహితుడికి వీక్లి ఆఫ్ ఇవ్వడం లేదని రాము చెప్పాడు. తన స్నేహితుడు ఆదివారం చర్చికి వెళ్లాల్సి ఉంది. అతను ఓనర్ రిక్వెస్ట్ చేసి రెండు గంటలకు చర్చికి వెళ్లేవాడు. వచ్చిన తర్వాత రెండు గంటలు ఎక్కువగా పనిచేసేవాడని రాము తెలిపాడు. ఇదంతా నచ్చని అతను కొద్ది రోజుల క్రితం ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయాడని వివరించాడు.

కార్మిక చట్టాలు
ఇది రాము, అతడి స్నేహితుడి కథ మాత్రమే కాదు.. చాలా మంది వెయిటర్స్, నిర్మాణ కార్మికులు, వాచ్ మెన్ల పరిస్థితి. పరిశ్రమల చట్టం 1948, తెలంగా షాప్స్ చట్టం 1988 ప్రకారం ఉద్యోగులకు కొన్ని హక్కులు ఉన్నాయి. పరిశ్రమ చట్టాల ప్రకారం కనీసం 240 పనిచేసే ఉద్యోగులకు సంవత్సరానికి 12 సెలవులు ఇవ్వాలి. అలాగే వారానికి ఒక రోజు ఆఫ్ ఇవ్వాలి. అలాగే 8 గంటలు మాత్రమే పని చేయించాలి. వారంలో 48 గంటలు మాత్రమే పని చేయంచాలి.












Click it and Unblock the Notifications