హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీకి షాక్: బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి..? అదేం లేదని క్లారిటీ

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్ ఏమో కానీ.. ఆ తర్వాత కూడా పార్టీ మారే ప్రక్రియ జరుగుతుంది. ఈటల రాజేందర్ పార్టీ మార్పునకు సంబంధించి నిన్ననే ఓ కథనం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌లో కీలక నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారట. ఆయన బీజేపీలో చేరబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కీలక నేతలపై గురి

కీలక నేతలపై గురి

కాంగ్రెస్ పార్టీ నేతలపై బీజేపీ గురి పెట్టింది. డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారట. ఆయనతోపాటు డీకే అరుణ కూడా ఉన్నారని తెలిసింది. కొన్ని రోజుల నుంచి ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల శశిధర్ రెడ్డి చేస్తోన్న కామెంట్స్ కూడా ఆయన పార్టీ మారబోతున్నారనే సంకేతాలను ఇస్తున్నాయి.

రేవంత్‌పై విసుర్లు

రేవంత్‌పై విసుర్లు


రేవంత్ రెడ్డిపై ఇటీవల శశిధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి రేవంత్ కారణమని మండిపడ్డారు. పార్టీకి నష్టం కలిగించేలా ఆయన చేస్తున్న పనులు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ రేవంత్ రెడ్డి ఏజెంట్ మాదిరి పని చేస్తున్నారని విమర్శించారు. దీంతో పార్టీ మార్పు తథ్యం అనే వార్తలు వచ్చాయి.

కీ లీడర్

కీ లీడర్


కాంగ్రెస్ పార్టీలో శశిధర్ రెడ్డి కీలక నేత.. పీజేఆర్ ఉన్న సమయంలో బ్రదర్స్‌లా పనిచేశారు. వైఎస్ఆర్ ఉన్న సమయంలో కూడా వీరికి తగిన ప్రయారిటీ దక్కింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి.పీసీసీ చీఫ్‌లు మారారు. రాష్ట్రం వీడిపోయింది. అంతకుముందే పీజేఆర్ చనిపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో.. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో కీలక నేతగా శశిధర్ రెడ్డి ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవీ చేపట్టిన తర్వాత సీనియర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వీహెచ్ లాంటి సీనియర్ బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కానీ వీహెచ్.. పార్టీ వీడి.. మరో పార్టీలో చేరేది లేదు. అవకాశం ఉన్న.. శశిధర్ రెడ్డి మాత్రం పార్టీ వీడేందుకు సిద్దం అయ్యారట.

 అబ్బే అదేం లేదు..

అబ్బే అదేం లేదు..

పార్టీ మార్పు అంశంపై శశిధర్ రెడ్డి స్పందించారు. అబ్బే అదేం లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని.. తాను ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదని... తాను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని చెప్పారు. పర్సనల్ వర్క్ మీద ఢిల్లీ వచ్చానని వివరించారు. తాను బీజేపీలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదని తెలిపారు. ప్రతి నెల తాను ఢిల్లీకి వస్తూనే ఉంటానని... అయితే ఈసారి ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రం పార్టీ మారుతున్నాననే ప్రచారం జరిగిందని వివరించారు. ఇది తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.

English summary
marri shashidhar reddy will join the bjp in soon. he touch with the bjp key leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X