Hyderabad: వచ్చే మూడు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు..!

భారత వాతావరణ విభాగం (IMD) జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో అధిక వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఈ రోజు రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింత విస్తరించాయని తెలిపింది. రుతుపవనాలు సాధారణం కంటే రెండు రోజుల ముందుగానే మే కేరళ, ఈశాన్య ప్రాంతంలో ప్రవేశించాయి. గత నెలలో నగరంలో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ అమీర్‌పేట, మారేడ్‌పల్లి, గోల్కొండలో సాధారణ వర్షపాతం నమోదైంది.

మరోవైపు నాంపల్లి, ఖైరతాబాద్, చార్మినార్‌లలో భారీ వర్షం కురిసింది. జూన్‌లో హైదరాబాద్‌లో సగటున 154.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాంపల్లిలో అత్యధికంగా వర్షపాతం నమోదు అయింది. మండలంలో సాధారణం 114.2 మి.మీ కు గాను 217.8 మి.మీ. ఇదిలా ఉండగా, జూలై 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లోని చార్మినార్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్‌, సికింద్రాబాద్‌, సేరి లింగంపల్లి మండలాల్లో మూడు రోజుల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

Meteorological department has said that there is a possibility of heavy rains in Hyderabad for the next three days

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేనప్పటికీ, జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని IMD అంచనా వేసింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోన ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. వచ్చే ఐదు రోజుల పాటు తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, మహబూబ్‌ నగర్‌, జోగుళాంబ గద్వాల, నల్గండ, నారాయణపేట్‌, మెదక్‌, జగిత్యాల, నిర్మల్‌, సంగారెడ్డి జి ల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసిది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రా, కోస్తా, దాక్షిణ కోస్తా, రాయలసీమ జి ల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+