మెట్రో నిర్మాణ సిబ్బందిలో లోకల్ జాక్సన్.. డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న వీఐపీలు, వీవీఐపీలు.. కానీ
హైదరాబాద్ : ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. అయితే దాన్ని బయట పెట్టేందుకు కొందరికి మాత్రమే అవకాశం వస్తుంది. ఇదే కోవలోకి వస్తాడు ఓ మెట్రో నిర్మాణ కార్మికుడు. పాప్ రారాజు మైకేల్ జాన్సన్‌ను మరిపించేలా డ్యాన్స్‌తో అదరగొట్టే ఆ యువకుడి టాలెంట్ గురించి సోషల్ మీడియా పుణ్యమాని అందరికీ తెలిసింది. అబ్బురపరిచేలా అతను చేసిన డ్యాన్స్ వైరల్ అయింది.
ఓ కన్‌స్ట్రక్షన్ వర్కర్ లంచ్ బ్రేక్‌లో తోటి వర్కర్లను అలరించేందుకు చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. చేతిలో కర్రతో అతను చేసిన డ్యాన్స్ మతి పోగొడుతోంది. మైకేల్ జాక్సన్‌ను మరిపించేలా ఆయన వేసిన స్టెప్పులు చూసి పలువురు వీడియోను షేర్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి మా ప్రాజెక్టులో పనిచేస్తుండటం గర్వంగా ఉందని అన్నాడు. ఆ డ్యాన్సింగ్ వీడియో చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిదా అయ్యారు. సూపర్ టాలెంట్ అంటూ రీట్వీట్ చేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఆ వీడియోలో ఉన్నది ఎవరు? నిజంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికుడేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో రైల్ ఎండీ పోస్ట్ చేసిన వీడియోతో అసలు హైదరాబాద్‌తో సంబంధమే లేదని అంటున్నారు. అది చైనాకు చెందిన భవన నిర్మాణ కార్మికుడి వీడియో అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
— MD HMRL (@md_hmrl) June 9, 2019
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications