Nehru Zoological Park: నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు వెళ్తున్నారా.. అయితే టికెట్లు ఇలా బుక్ చేసుకోండి..
నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు సంబంధంచి వెబ్ సైట్, మొబైల్ యాప్ ను ప్రారంభించారు.
హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఆన్‌లైన్ టిక్కెట్ల కోసం మొబైల్ యాప్‌తో పాటు కొత్త వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించారు. తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి లాంచ్ చేశారు. కొత్త వెబ్‌సైట్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సిజిజి) అభివృద్ధి చేసింది. వెబ్ సైట్ రావడంతో సాధారణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్ బుక్ చేసువచ్చు.

బ్యాటరీ వాహనాలు
మొబైల్ యాప్ ద్వారా బ్యాటరీ వాహనాలు కూడా బుక్ చేసుకోవచ్చని జూ అధికారులు తెలిపారు. వెబ్ సైట్ ప్రారంభోత్స కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, అటవీ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://nzptsfd.telangana.gov.in/home.do వెబ్ సైట్ వెళ్లడం ద్వారా జూ వేళ్లానుకునే వారు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

1,500 రకాలు
ఈ నెహ్రూ జూలాజికల్ పార్కులో 1,500 కంటే ఎక్కువ రకాల పక్షులు, జంతువులు, సరీసృపాలు ఉన్నాయి. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో ఆచార్య ఎన్ జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి దగ్గరలో ఈ పార్కు ఉంటుంది. ఈ పార్కులో మైనస్, తెల్ల నెమళ్ళు, ఆఫ్రికన్ ఏనుగులు, చింపాంజీలు, ఖడ్గమృగాలు ఉన్నాయి. జూ లోపల సందర్శకులకు ప్రధాన ఆకర్షణ లయన్ సఫారి. ఇనుముతో నిండిన వాన్ సవారీ సౌకర్యాలు ఉన్నాయి.

1963 నుంచి
ఈ నెహ్రూ జూలాజికల్ పార్కు 300 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. పార్కులో తిరగాలంటే 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. నెహ్రూ జూ పార్క్‌కు 1959లో శంకుస్థాపన చేయగా.. అక్టోబరు 12, 1963 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
-
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..!












Click it and Unblock the Notifications