Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kajal హనీమూన్ ట్రిప్ ఖర్చు ఎంతో తెలుసా..నెటిజెన్లు ఏ అంశంపై గూగ్లింగ్ చేశారు..?

హైదరాబాదు: కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లును ఈ అందాల భామ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాజల్ పెళ్లి విషయం తెలియగానే ఆమెను ఆరాధిస్తున్న చాలామంది ఒక్కింత ఆవేదనకు గురయ్యారు. కానీ వారే ఆ తర్వాత శుభాకాంక్షలు చెప్పారు. ఇక కరోనా కారణంగా అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య కాజల్ వివాహం జరిగింది. కాజల్ వివాహంకు మీడియా కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత కాజల్ దంపతులు హనీమూన్‌కు మాల్దీవులకు వెళ్లారు. అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలను కాజల్ సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. ఇప్పుడు నెటిజెన్లంతా కాజల్ హనీమూన్‌కు ఎక్కడికెళ్లారు..? ఎక్కడ ఉన్నారు.. ఆమె హనీమూన్‌కు ఖర్చు ఎంతైంది అనే విషయంపై సెర్చ్ చేస్తున్నారు.

నెటిజెన్లు ఎక్కువగా గూగ్లింగ్ చేసింది ఏంటంటే..?

నెటిజెన్లు ఎక్కువగా గూగ్లింగ్ చేసింది ఏంటంటే..?

ప్రముఖ టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుతో వివాహం తర్వాత హనీమూన్‌కు మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఆమె చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో ఎంగేజ్ అయ్యింది. అక్కడ సముద్ర తీరంలో భర్త గౌతమ్‌తో కలసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది కాజల్. ఈ దంపతుల ఫోటోలను చూసిన అభిమానులు కాజల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కపుల్ ఉందంటూ కామెంట్స్ పెట్టారు. ఇక తాజాగా ఈ చందమామకు సంబంధించి నెటిజెన్లు పలు విషయాలను తెలుసుకునేందుకు గూగ్లింగ్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆమె హనీమూన్ ట్రిప్‌కు అయిన ఖర్చు, ఆమె ధరించిన కాస్ట్యూమ్స్‌ ధర తెలుసుకునేందుకు నెటిజెన్లు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు.

రెడ్ కలర్ డ్రెస్‌లో మిత్రవింద అదుర్స్

రెడ్ కలర్ డ్రెస్‌లో మిత్రవింద అదుర్స్


ఇక కాజల్ అగర్వాల్ ధరించిన రెడ్ కలర్ ఔట్‌ఫిట్ ధర రూ.13వేలు అని సమాచారం. కాజల్ ధరించిన రెడ్ కలర్ డ్రెస్‌కు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, రెడ్ కలర్ టోపీ పెట్టుకోవడం మరింత అందాన్ని ఇచ్చిందని నెటిజెన్లు కామెంట్ చేశారు. ఈ మిత్రవిందా చాలా ట్రెండీగా కూడా కనిపించిందని పోస్టులు పెట్టారు. ఇప్పటికే కాజల్ తన అభిమానులతో కలిసి మాల్దీవుల్లో తీసుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక నెటిజెన్లు సెర్చ్ చేసిన మరో అంశం కాజల్ అగర్వాల్ హనీమూన్ ట్రిప్‌కు అయిన ఖర్చు. కాజల్ దంపతుల హనీమూన్ ట్రిప్‌కు అయిన ఖర్చు రూ. 5 కోట్లుగా ఉందని సమాచారం.

ఆ హోటల్ ప్రత్యేకత

హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన కాజల్ దంపతులు అక్కడ ది మురకా అనే హోటల్‌లో ఉన్నారు. ఈ హోటల్ సముద్రం కింద 16 అడుగుల లోపల ఉంది. ఈ హోటల్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే సముద్రం కింద నిర్మించబడ్డ తొలి హోటల్. ఈ హోటల్‌కు సొంతంగా రెండు ప్రైవేట్ సీ ప్లేన్‌లు ఉన్నాయి. హిల్టన్ వరల్డ్ వైడ్ అనే సంస్థకు చెందినది ఈ హోటల్. ఇక పెళ్లి హనీమూన్ తర్వాత త్వరలోనే కాజల్ తన సినిమా షూటింగ్‌లోపాల్గొంటుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి ఆమె చిరంజీవి నటిస్తున్న ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+