ఆ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారు.. కాపురానికి రానివ్వట్లేదు.. భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా...

వివాహమైన కొద్దిరోజులకే వేధింపులు మొదలయ్యాయని... తనను వదిలించుకోవాలని చూస్తున్నారంటూ ఓ యువతి తన కుటుంబంతో కలిసి అత్తింటి ఎదుట ధర్నాకు దిగింది. తన భర్త కాపురానికి పనికిరాడన్న విషయాన్ని దాచిపెట్టి పెళ్లి జరిపించారని ఆరోపించింది. పెళ్లి సమయంలో భారీగా కట్న,కానుకలు తీసుకుని ఇప్పుడు తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. తనకు న్యాయం జరిగేదాకా ఇంటి ముందు నుంచి కదిలేది లేదని తెలిపింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

కరీంనగర్‌లోని భగత్ నగర్ కాలనీకి చెందిన గుంజి శ్రీనివాస్,పద్మలకు ఇద్దరు కుమార్తెలు. ఉద్యోగ రీత్యా శ్రీనివాస్ ముంబైలో ఉంటున్నారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన పెద్ద కుమార్తె తేజస్విని పెళ్లి జరిపించారు. హైదరాబాద్‌ నాగోలు డివిజన్‌ పరిధిలోని రాక్‌టౌన్ కాలనీకి చెందిన ఏడుకొండలు-సుశీల దంపతుల పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు(30)తో ఆమె వివాహం జరిగింది. వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

కాపురానికి రానివ్వకుండా వేధింపులు...

కాపురానికి రానివ్వకుండా వేధింపులు...


ప్రస్తుతం తేజస్విని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. వివాహ సమయంలో తేజస్విని తల్లిదండ్రులు సుమారు రూ.20లక్షలు బంగారం,ఇతర కట్న కానులు సమర్పించారు. పెళ్లి సమయంలో వెంకటేశ్వర్లు నానమ్మ అనారోగ్యంతో ఉందని చెప్పి వివాహ తంతుని త్వరగా ముగించేశారు. తీరా పెళ్లయిన వారం రోజులకే తనకు వేధింపులు మొదలయ్యాయని తేజస్విని చెబుతోంది. భర్త,అత్త,మామలు,ఆడపడుచు తనను వేధింపులకు గురిచేస్తున్నారని... తనను కాపురానికి రానివ్వకుండా పుట్టింటి వద్దే ఉంచుతున్నారని వాపోయింది.

ఆ విషయం దాచిపెట్టి పెళ్లి...

ఆ విషయం దాచిపెట్టి పెళ్లి...

అంతేకాదు,తన భర్త వెంకటేశ్వర్లు కాపురానికి పనికిరాడన్న విషయం దాచి పెట్టి పెళ్లి జరిపించారని తేజస్విని ఆరోపించింది. దీన్ని కప్పి పుచ్చేందుకే తనపై వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పింది. ఇదే విషయమై ఈ నెల 24న ఎల్‌బీ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపింది. కేసును సరూర్ నగర్ పోలీసులకు బదిలీ చేయడంతో... ఇరువురిని అక్కడికి పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించినట్లు పేర్కొంది. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించుకుంటామని అత్తింటివారు పోలీసులతో చెప్పారని... కానీ ఇప్పటివరకూ అలాంటిదేమీ జరగలేదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే న్యాయం కోసం అత్తింటి ఎదుట ధర్నాకు దిగినట్లు తేజస్విని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+