హెల్త్ ఎమర్జెన్సీ లేదు.. గాలి మాటలొద్దు.. విపక్ష నేతలపై మంత్రి గరం
హైదరాబాద్ : విపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. నిజాలను తొక్కి పెడుతూ అబద్దాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలది అనవసర రాద్దాంతమే తప్ప అందులో వాస్తవాలు లేవని చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి.. సీజనల్ వ్యాధుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు. విపక్ష నేతల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని.. ఆ మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు అందుతున్నాయని తెలిపారు. విష జ్వరాలను అదుపు చేయడానికి డాక్టర్లు శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు.

హైదరాబాద్‌లో విష జ్వరాలను కంట్రోల్ చేయడానికి డాక్టర్లు అలర్ట్‌గా ఉన్నారని చెప్పిన మంత్రి.. ఆదివారం సైతం నిరంతర వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అవేమీ తెలియకుండా విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు.
హెల్త్ ఎమర్జెన్సీ ఏమీ లేదని.. ఇలాంటి సమయాల్లో ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని చెప్పుకొచ్చారు. దేశంలోనే నెంబర్ వన్ మెడికల్ సేవలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. డెంగీ విజృంభిస్తున్నప్పటికీ.. దానిని కంట్రోల్ చేసేలా చర్యలు స్పీడప్ చేశామని తెలిపారు. ఆ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొందరు నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని.. పబ్లిసిటీ స్టంట్ కోసం గాలి మాటలు మాట్లాడొద్దని సూచించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications