హైదరాబాద్ హౌస్ ఫుల్... అద్దెకు ఇళ్లు లేవు.. గమనించగలరు!
దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ నగరంలో ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలమంది తరలివస్తూనే ఉంటారు. దీనివల్ల ప్రధానంగా అద్దె ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అద్దె ఇంటికోసం 22 శాతం డిమాండ్ పెరిగింది. డిమాండ్ ఇలా ఉంటే.. అద్దెకు ఇళ్లు మాత్రం దొరకడంలేదు.
నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎక్కడా టూలెట్ బోర్డు కనపడటంలేదు. జూన్ త్రైమాసికంంలో 20.1 శాతం మేర అద్దె ఇళ్ల సరఫరా తగ్గినట్లు రియల్ ఎస్టేట్ ప్లాట్ ఫామ్ మ్యాజిక్ బ్రిక్స్ వెల్లడించింది. ఏప్రిల్ టు జూన్ 2023 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఎక్కువ మంది అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్న ప్రాంతాల్లో గచ్చిబౌలి, కొండాపూర్ ముందు వరుసలో ఉన్నాయి.

పనిచేసే కార్యాలయాలకు దగ్గరగా ఉండటంతోపాటు రవాణా సౌకర్యం కూడా మెరుగ్గా ఉండటంతో ఈ రెండు ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. టూ బెడ్ రూమ్ ఇళ్లు రూ.20వేల నుంచి రూ.32వేల వరకు ఉన్నాయి. 3 బెడ్ రూమ్ ఇళ్లు రూ.30వేల నుంచి రూ.45వేలు పలుకుతున్నాయి. ఫర్నిచర్ తో ఉన్న ఇళ్లకు 55 శాతం డిమాండ్ ఉండగా, సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లకు 23 శాతం డిమాండ్ ఉంది.
హైటెక్ సిటీ ప్రాంతంలో టూబెడ్ రూమ్ ఇల్లు రూ.32వేలుగా ఉంది. 3 బెడ్ రూమ్ ఇల్లు కావాలంటే రూ.47వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. గచ్చిబౌలిలో రూ.24వేలు, జూబ్లీహిల్స్, కోకాపేట ప్రాంతాల్లో రూ.24వేలు, కూకట్ పల్లి, మణికొండ ప్రాంతాల్లో రూ.16వేలు, రూ.17వేలుగా టూబెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications