నేను ఎంపీని- బడ్జెట్ సెషన్స్ ఉన్నాయ్: వీలు చూసుకుని వస్తా: తేల్చేసిన బండి సంజయ్

బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించిన ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోన్నారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ ఎంపీ అరవింద్ ధర్మపురి కూడా తప్పు పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. మద్యం కుంభకోణానికి పాల్పడిన కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.

Not possible, BJP Chief Bandi Sanjay in response to summon letter sent by Women Commission

ఈ కేసులో కవిత జైలుకు వెళ్లడం ఖాయమని, తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదనీ హెచ్చరించారాయన. చట్టసభల్లో మహిళకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ ఢిల్లీలో కవిత దీక్ష చేయడంలో అర్థం లేదని, కేసీఆర్ పాలనలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాల మీద ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బంజారాహిల్స్ సహా పలు పోలీస్ స్టేషన్ లల్లో ఫిర్యాదు చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా కల్వకుంట్ల కవితను కించపరిచేలా బండి సంజయ్ వ్యాఖ్యానాలు చేశారని, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీనిపై అటు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. బండి సంజయ్ కు సమన్లను జారీ చేసింది. విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఈ నోటీసుల ప్రకారం.. బుధవారం ఉదయం11 గంటలకు విచారణకు హాజరుకావాల్సి ఉంది. తాజాగా బండి సంజయ్- ఈ నోటీసులపై స్పందించారు.

తాను విచారణకు రాలేనని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న లోక్ సభ సభ్యుడినని, ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున తాను ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని చెప్పారు. ఈ నెల 18వ తేదీన ఏదో ఒక సమయంలో తాను మహిళా కమిషన్ కార్యాలయానికి వస్తానని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+