• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

5 రోజులే సమయం.. నిమజ్జనంపై రానీ క్లారిటీ... పగిడీతో ఖైరతాబాద్ గణేశుడు దర్శనం

|

ఖైరతాబాద్ మహా గణపతి సహా నగరంలో గల వేలాది విగ్రహాల నిమజ్జనం ఎక్కడా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. నిమజ్జనానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే సమయం ఉండటంతో ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దనే తీర్పును అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. గత వారం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపిన ధర్మాసనం.. నిమజ్జనంపై తీర్పును సవరించలేమని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇటు హైకోర్టు ఆదేశాలు, అటు ప్రభుత్వం నుంచి స్పష్టత లేక భక్తులు అయోమయంలో పడ్డారు.

సాగర్‌లో నిమజ్జనం..

సాగర్‌లో నిమజ్జనం..


ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జనం హుస్సేన్‌ సాగర్‌లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ భారీ గణనాథుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారు? అక్కడి వరకు ఆ విగ్రహాన్ని ఎలా తరలిస్తారనే అంశం సస్పెన్స్‌గా మారింది. భాగ్యనగరంలో భారీ సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేశారని, వాటిలో నెలకొల్పిన వేలాది విగ్రహాల నిమజ్జనానికి తగినన్ని నీటి కుంటలు అందుబాటులో లేవని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ సారికి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి అనుమతించాలని.. లేకపోతే నిమజ్జనం పూర్తి కావడానికి ఆరు రోజుల సమయం పడుతుందని తెలిపింది. సాగర్‌లో రబ్బర్‌ డ్యామ్ ఏర్పాటు చేసి నిమజ్జనం చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. రబ్బరు డ్యామ్‌ నిర్మాణం ఇప్పటికిప్పుడు కష్టమని.. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయలేమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని వివరించింది.

 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..

బల్దియా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని 25 చెరువుల్లో ప్రత్యేక కొలనులు నిర్మిస్తోంది జీహెచ్‌ఎంసీ. కొలనులు తీసి నీరు నింపేందుకు ఇంకొన్ని రోజులు సమయం పట్టనుంది. దీనికి తోడు పెద్ద విగ్రహాల నిమజ్జనం బేబీ పాండ్స్‌లో కష్టమవనుంది. ఒక్కో సంవత్సరం ఒక్కో ఆహార్యంతో భక్తులను విశేషంగా ఆకట్టుకునే ఖైరతాబాద్ మహాగణనాథుడు ఆకట్టుకుంటారు. ఈ ఏడాది కూడా కొత్త అవతారంతో వెలిగిపోతున్నాడు. భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి భక్తులకు సరికొత్తగా దర్శనం ఇస్తున్నాడు. తొలిసారిగా పగిడితో మరింత శోభాయామానంగా కనువిందు చేస్తున్నాడు.

పగిడి..

పగిడి..

నగరంలో వేలాది వినాయకులు కొలువుదీరి ఉన్నారు. పలు ప్రాంతాల్లో పలు అవతారాలతో వినాయకుడు భక్తుల పూజలు అవదుకుంటున్నాడు. అలా పలు ప్రాంతాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరులకు తలకు పగిడి ఉండడాన్ని గమనించిన స్థానికులు రాకేష్ ముదిరాజ్, ముకేశ్ ముదిరాజ్‌.. మహాగణపతికి కూడా పగిడి ఉంటే బాగుంటుందని అనుకున్నారు. పగిడితో మహానాయకుడు కొత్త అందంతో వెలిగిపోవాలనే భక్తిభావంతో తమ ఆలోచనను ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా సంతోషంగా అంగీకరించేసరికి ..ఇక వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. అంతే బాహుబలి సినిమాలో పగడిలను రూపొందించిన చార్మినార్‌కు చెందిన బృందం వద్దకు వెళ్లి..ఖైరతాబాద్ మహాగణపతికి పగిడి తయారుచేయాలని కోరారు. దానికి వారు పగిడి తయారీకి కావాల్సిన మెటీరియల్‌తో ఖైరతాబాద్ చేరుకున్నారు.

 1100 కిలోల లడ్డూ

1100 కిలోల లడ్డూ

మహాగణపతి ఆకారానికి సరిపడా పాగా తయారు చేయాలంటే ఎంత మెటీరియల్ పడుతుందో అంచనా వేశారు. 14 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉండే పగిడీని తయారు చేసి వినాయకుడికి అలంకరించారు. అలా ఈ సంవత్సరం పగిడితో వినాయకుడు మరింత అందంగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. పగిడి గణపయ్యను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఖైరతాబాద్ పంచముఖ గణనాథుడు ఈ ఏడాది 40 అడుగుల ఎత్తుతో ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. ఈ మహాగణపయ్య 1100 కిలోల భారీ లడ్డూతో అలరారుతున్నాడు.

English summary
not yet confirmed ganesh immersion at hyderabad. high court break the immersion in hussain sagar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X