Hyderabad: తార్నాక జంక్షన్ పై కీలక నిర్ణయం..!
హైదరాబాద్ లోని తార్నాక, చుట్టుపక్కల నివసించే వాహనదారులకు ఉపశమనం కలగనుంది. తార్నాక జంక్షను పున ప్రారంభించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో గత ఎనిమిది ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న స్థానికులకు ఈ నిర్ణయం శుభవార్తగా చెప్పొచ్చు. దూరం వెళ్లి యూటర్న్ తీసుకునే వాహనదారులకు ఇప్పుడు ఆ బాధ తప్పనుంది. తార్నాక జంక్షన్ తిరిగి ప్రారంభించే విషయమై ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ అక్కడ పర్యటించారు.
తార్నాక జంక్షన్‌కు ఇరువైపులా ఉన్న రోడ్లను, బస్టాప్ లను, ఫుత్ పాత్లను చూశారు. ఎలాంటి మార్పులు చేయాలో అధికారులకు వివరించారు. 15 రోజుల్లోగా జంక్షన్ ను పున ప్రారంభించే అవకాశం ఉంది. ఇది జరిగితే యూ-టర్న్‌ల అవసరం ఉండదని.. కిలోమీటరు మేర ప్రయాణ భారం తగ్గుతుందని స్థానికులు చెప్పుకుంటున్నారు. 8 సంవత్సరాల క్రితం అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని.. ట్రాఫిక్ మేనేజ్ మెంట్ లో భాగంగా జంక్షన్ మూసి వేశారు. దీంతో కిలో మీటర్ దూరం వెళ్లి యూటర్న్ తీసుకుని వెళ్లాల్సి వచ్చేది.

రైల్వే డిగ్రీ కాలేజీ సమీపంలోకి వెళ్లి యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చేది. ఇటు ఐఐసీటీ సమీపంలో యూ-టర్న్ ఉంది. జంక్షన్ తిరిగి ప్రారంభిస్తే ఈ యూటర్న్ లు తీసుకోవాల్సి అవసరం ఉండదు. ఈ యూటర్న్ ల వల్ల ఉదయం, సాయంత్రం వాహనదారులు గంటల తరబడి రోడ్డుపై ఉండాల్సి వస్తోంది. యూటర్న్ వద్ద ప్రమాదాలు కూడా పెరిగాయి. దీంతో జంక్షన్ తిరిగి ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రాస్ రోడ్డు దిగ్బంధనంతో వాహనదారులు చాలాసేపు యూటర్న్‌లు తీసుకోవాల్సి వచ్చింది.
ఈ నిర్ణయం పట్ల తార్నాక డివిజన్ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీలతకు శనివారం కృతజ్ఞతలు తెలిపారు. జంక్షన్ వర్ద ఐలాండ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇరువైపులు మూడు మీటర్ల మేర ఫుట్ పాత్ ను తగ్గించనున్నారు. దీంతోపాటు జంక్షన్ సమీపంలో ఉన్న బస్టాండ్లను తరలించనున్నారు. అటు అమీర్ పేట, మైత్రవనం చౌరస్తాలో కూడా బస్టాండ్ల తరలించే అవకాశం ఉంది. బస్టాండ్లను మెట్రో స్టేషన్ కిందికి తరలిస్తే.. ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications