Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hyderabad: ముస్లిం పండుగ రోజు రక్తదానం చేసిన చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు..

భారతదేశంలో మత సామరస్యం ఎప్పుడు ఆదర్శప్రాయమే.. భిన్న మతలు, భిన్న కులాల ఉన్న దేశంలో ప్రజలందరూ అన్నదమ్ముల కలిసి ఉంటారు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. తాజాగా సెప్టెంబరు 16 సోమవారం మిలాద్-ఉన్-నబీ రోజున హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని మస్జిద్-ఇ-మహమ్మద్ హుస్సేన్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తాన్ని సేకరించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చిలుకూరు బాలాజీ అర్చకులు మత సామరస్యాన్ని చాటారు. ముజ్తబా హసన్ అస్కారీ నేతృత్వంలోని హైదరాబాద్‌కు చెందిన ఎన్జీవో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎన్జీఓ తీవ్రమైన లుకేమియా లేదా రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి లక్డికాపూల్‌లోని MNJ క్యాన్సర్ హాస్పిటల్‌తో కలిసి పనిచేస్తోంది.

On the day of Milad-un-Nabi the chief priests of Chilukur Balaji donated blood

నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ పేరు మీద ఉన్న MNJ క్యాన్సర్ హాస్పిటల్ సంవత్సరంలో 2500 పెద్దలు, 4000 చిన్నారులకు శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంది. ఆసుపత్రిలో రోగులకు సేవలందించేందుకు ప్రతిరోజూ దాదాపు 100 యూనిట్ల రక్తం అవసరమవుతుంది. దీంతో NGO డ్రైవ్ నుంచి 200 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లుకేమియా, రక్త క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ రక్తాన్ని అందిస్తోంది.

ఈ ఫౌండేషన్ సంవత్సరాలుగా చేస్తున్న కృషిని ఆలయ ప్రధాన అర్చకులు అభినందించారు. మసీదులో రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన ముస్లిం సోదరుల కృషిని అభినందిస్తూ, వారి రక్తదానం ప్రాణాలను కాపాడేందుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన ఇంజినీరింగ్ బ్యాచ్‌మేట్స్ ముజ్తబా హసన్ అస్కారీ, సిఎస్ రంగరాజన్ రక్తదాన కార్యక్రమంలో కలిప్పుడు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. నగరంలో వినాయక చతుర్థి సందర్భంగా హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చూసి తాను నిజంగా స్ఫూర్తి పొందానని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+