Mega vs Allu:మెగా ఫ్యామిలీకు అల్లు అర్జున్‌ దూరం ..?

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. దీనిపై ఈ రెండు ఫ్యామిలీలు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇలాంటి రూమార్స్ తెర మీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు.

69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఓ తెలుగు నటుడు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.దీంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు అల్లు అర్జున్‌కు సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలిపారు.

mega and allu family

అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఊహించనంత స్పందన రాలేదని అల్లు అభిమానుల వాదన. తమ హీరోకు పేరు వస్తుందని మెగా హీరోలు అసంతృప్తితో ఉన్నారని అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సరైనోడు సినిమా సక్సెస్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ గురించి చెప్పమని అభిమానులు అడగ్గా.. 'చెప్పాను బ్రదర్' అంటూ అల్లు అర్జున్ తెలిపారు.

అప్పటి నుంచి మెగా అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సోషల్ మీడియాలో యుద్దం చేసుకుంటున్నారు. గతంలో ఈ కట్టే కాలే వరకూ మెగా అభిమానినే చెప్పిన అల్లు అర్జున్..ఇటీవల కాలంలో అల్లు ఆర్మీకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని విభజించి మాట్లాడుతూ వస్తున్నారాయన. తాజాగా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంపై మెగా హీరోలు అరకొరగానే స్పందించారని అల్లు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క వరుణ్ తేజ్ మాత్రమే అల్లు అర్జున్‌ను కలిసి అభినందించారు.

mega and allu family

మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా భావించే చిరంజీవితో పాటు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా హీరోలు కేవలం సోషల్ మీడియా ద్వారానే విషెష్ చెప్పి సైలెంట్ అయ్యారు. రామ్ చరణ్ అయితే జాతీయ అవార్డులు వచ్చిన వారితో కలిపి అల్లు అర్జున్‌కు అభినందనలు తెలిపారని.. అంతే కాని ప్రత్యేకించి తమ హీరోకు రామ్ చరణ్ ఏమీ విషెష్ తెలపలేదని .. అల్లు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

mega and allu family

చిరంజీవి వల్లే అల్లు అర్జున్ ఎదిగారనేది ఎంత నిజమో.. అల్లు రామలింగయ్య వల్లే చిరంజీవి ఇండస్ట్రీలో హీరోగా మనుగడ సాధించారనేది కూడా అంతే నిజమని మెగా హీరోలు గుర్తుంచుకోవాలని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు. జాతీయ అవార్డుతో అల్లు అర్జున్‌, చిరంజీవి ఫ్యామిలీకి గ్యాప్ మరింత పెరిగినట్టుగానే కనిపిస్తుంది. మరి మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య సాగుతున్న ఈ కోల్డ్ వార్‌కు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+