Good news:ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్మినెంట్..?

టీఎస్ఆర్టీసీ రూపు రేఖలను మారుస్తున్నారు ఎండీ సజ్జనార్. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనదైన శైలిలో కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ సమస్య ఇదీ అని.. బస్సు సౌకర్యం లేదని చెబితే చాలు ఇట్టే పరిష్కరిస్తున్నారు. ఇక కొలువులు.. జర్నలిస్టులకు ఆన్ లైన్‌లో టికెట్ బుకింగ్ సౌకర్యం.. ఇతర అంశాలను వెంటనే పరిష్కారం చూయించారు. ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగుల సమస్యను తీసుకున్నారు.

టీఎస్ఆర్టీసీలో పని చేసే తాత్కాలిక సిబ్బందికి న్యూ ఇయర్ రోజున గుడ్ న్యూస్ తెలియజేశారు. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తీపికబురు అందజేశారు. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్‌లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని భవిష్యత్‌లో పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణించేలా చర్యలు తీసుకోబోతున్నామని ప్రకటించారు. దీంతో చాలా కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. సజ్జనార్, ఆర్టీసీ సంస్థకు మన:పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశాయి.

outsourcing employees will permanent:rtc md sajjanar

Recommended Video

    Telangana Govt కి కృతజ్ఞతలు తెలిపిన RTC సిబ్బంది!!

    సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతామని తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదని చెప్పారు. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు.. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం కృషి చేయాలని స్పస్టంచేశారు. ఉద్యోగుల కొన్ని సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని.. కొత్త ఏడాదిలో వాటికి పరిష్కార మార్గం ఉంటుందని చెప్పారు. ఇప్పటికి అయితే ఒక్కో సమస్యను సాల్వ్ చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. త్వరలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఆయన చెప్పారు.

    ఆర్టీసీ బస్సులో ప్రయాణించే పన్నెండేళ్ల చిన్నారులకు ఇవాళ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో 12 ఏళ్ల లోపు చిన్నారులకు శాశ్వతంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దీనివల్ల టీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సజ్జనార్ తీసుకుంటున్న.. తీసుకోబోయే చర్యలు మాత్రం ఆర్టీసీకి మరింత హైప్ తీసుకొస్తున్నాయని.. ఆయన ఏ విభాగంలో పనిచేసినా సరే.. కష్టపడి వర్క్ చేస్తున్నారు. ప్రజల సమస్యలను ఇట్టే పరిష్కారం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+