Goutham: తండ్రికి తగ్గ తనయుడు.. వైరల్ అవుతోన్న గౌతమ్ ఫొటోలు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో మంది సాయం చేసి రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎంత మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు. కొద్ది రోజుల క్రితం తన అభిమాని ఇరాక్ కు చెందిన తాలిబ్ హమాజ్ కుమారుడి గుండె ఆపరేషన్ కు మహేష్ సాయం చేశాడు. మహేష్ బాబు ఎన్నో సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. తాజాగా అతని కుమారుడు గౌతమ్ తండ్రి బాటలోనే వెళ్తున్నారు.

గౌతమ్ కొద్ది రోజుల క్రితం రెయిన్ బోహాస్పిటల్స్ ని సందర్శించారు. ఆస్పత్రిలో మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందుతున్న చిన్నారులను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తల్లి, మహేష్ బాబు భార్య నమ్రతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందుతున్న కార్డియో, ఆంకాలజి వార్డుల్లో ఉన్న పిల్లలతో గౌతమ్ అప్పుడప్పుడు ఇలా సమయాన్ని గడుపుతాడు. చిన్నారులకు ధైర్యాని కలిగిస్తాడు. పిల్లల ముఖాల్లో నవ్వులు పూయిస్తాడు. గౌతమ్ నీకు ధన్యవాదాలు" అంటూ నమ్రత రాసుకొచ్చారు.

Photos of Mahesh Babus son Gautam with children are going viral on social media

చిన్నారులతో గౌతమ్ గడిపిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలు చూసిన మహేష్ అభిమానులు గౌతమ్ ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. చిన్నతనంలో గొప్ప మనస్సు గౌతమ్ ను పొగుడుతున్నారు. తండ్రి బాటలో కొడుకు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భవిష్యత్ లో గౌతమ్ కూడా గొప్ప పొజిషన్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా గుంటూరు కారం సినిమాలో చేస్తున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి ఈ చిత్రం షూటింగ్ మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుగా గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+