కనురెప్పే కర్కశంగా.. పిల్లాడిపై సైకో తండ్రి ప్రతాపం, కొట్టడంతో మృత్యువాత

తండ్రి అంటే మంచి చెడులు చెప్పాలి.. వారితో ఆడుతూ, పాడుతూ ఉండాలి. కానీ ఒకడు అలా లేడు. మద్యం మత్తులో మునిగిపోయాడు. రెండేళ్ల చిన్నారిపై తన ప్రతాపం చూపించాడు. కొట్టి.. చనిపోయేందుకు కారణం అయ్యాడు. హైదరాబాద్ నేరెడ్ మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది.

నేరెడ్‌మెట్ జేజేనగర్‌కు చెందిన సుధాకర్, దివ్య మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం కావడం విశేషం. వీరికి రెండేళ్ల కుమారుడు జీవన్ ఉన్నాడు. ఓ అపార్టు‌మెంట్‌లో సుధాకర్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఆయన భార్య కూడా పనిచేస్తోంది. సుధాకర్ మద్యానికి బానిస అయ్యాడు. ఇంకేముంది పెళ్లాం, పిల్లాడిని సరిగా చూసుకోవడం లేదు.

psycho father beat two years old child, died

పిల్లాడు జీవన్ రెండెళ్లే.. అల్లరి చేయడం కామనే. బాలుడు ఏడుస్తుండటంతో తండ్రి సహనం కోల్పోయాడు. తీవ్రంగా కొట్టడంతో ఆ బాలుడు అపస్మారస్థితిలోకి వెళ్లిపోయాడు. మొహం, కడుపులో గాయాలు కూడా ఉన్నాయి. దివ్య అపార్ట్ మెంట్ పై ప్లోరో వెళ్లి కిందకు వచ్చేసరికి.. కన్న కొడుకునే కొట్టి చంపేశాడు. ఆ బాలుడి పరిస్థితిని గమనించిన దివ్య వెంటనే ఆస్పత్రికి తరలించింది. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

మందుకు బానిసగా మారిన సుధాకర్ సైకోలా మారాడు. ఇదివరకు అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడట. అప్పుడు బతికి బయటపడి.. ఇప్పుడు కొడుకునే మట్టుబెట్టాడు. తాను పైకి వెళ్లి వచ్చేసరికి దారుణం జరిగిపోయిందని దివ్య అంటోంది. తన కొడుకు కదలడం లేదని చెప్పింది. వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చామని.. ఎవరూ అడ్మిట్ చేసుకోలేదని వాపోయింది. కాళ్లు మొక్కగా.. ఒకరు పట్టి చనిపోయాడని నిర్ధారించారని వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తే చంపాడని తెలుపడంతో.. సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+