హ్యాపీ వినాయక చవితి: పుష్ప, ఆర్ఆర్ఆర్ ప్రతిమల గణేశ్ విగ్రహాలు
వినాయక చవితి పండగ సందర్భంగా వెరైటీ విగ్రహాలు విక్రయిస్తున్నారు. ఏ సినిమా వస్తే.. ఆ మూవీ మాదిరిగా అమ్ముతుంటారు. ఈ సారి పుష్ప, ఆర్ఆర్ఆర్ మేనియా ఉంది. రికార్డులతో దుమ్ము రేపిన పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోని హీరో పాత్రలతో వినాయక విగ్రహాలు రూపొందాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన పోజులతో వినాయక విగ్రహాలను సిద్ధం చేశారు.
ఆ ఫొటోలను ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో పెట్టడంతో విపరీతంగా వైరల్ గా మారాయి. పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ డైలాగ్ 'తగ్గేదేలే..'. పలు చోట్ల ఇదే పుష్పరాజ్ పాత్ర ఆహార్యంలో.. అదే జుట్టు, వస్త్రాలు, ఇతర లక్షణాలతో.. తగ్గేదేలే అంటూ గడ్డంపై చేయి పెట్టినట్టుగా ఉన్న గణేశ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి వివిధ రూపాల్లోని గణేశ విగ్రహాలు అలరిస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ పరుగెడుతూ ఉన్నప్పటి తరహాలో, బాణాన్ని ఎక్కుపెడుతున్న తరహాలో రూపొందించిన గణేశ్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.
గణపతి పండగ సందర్భంగా అంతా ఒక్కటే హడావిడి.. పండగ సందర్భంగా ప్రముఖులు విష్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications