ఏమీ.. రాకేశ్ రెడ్డి, అదీ జైలా లేక.. అక్కడినుంచే బెదిరింపులా..? పీపీని కూడా వదల్లేదుగా..

ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డి ఆగడాలు తగ్గడం లేదు. జైలులో ఉన్న అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న స్ధిరాస్తి వ్యాపారి దంపతులను బెదిరించారనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అదీ అయితే ఓకే.. ఈ కేసు వాదిస్తోన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కూడా వదల్లేదు. రాకేష్ రెడ్డి అనుచరులు అతనికి వార్నింగ్ ఇచ్చారు.

హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాకేష్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అతని అనుచరులు అక్బర్ అలీ, గుప్త, శ్రీనివాస్ కేసు వాదిస్తోన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్దకు వచ్చారు. తమకు అనుకూలంగా వ్యవహరించాలని వారు అంటున్నారు. బెదిరింపులకు పాల్పడటంతో ఆయన జూబ్లీ‌హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాకేష్ రెడ్డి అనుచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలులో ఉన్ రాకేశ్ రెడ్డి ఆగడాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అంతా అక్కడ ఉండే నడిపిస్తున్నాడు.

rakesh reddy followers warn to pp

చిగురుపాటి జయరాంను హానీ ట్రాప్ ద్వారా పిలిపించిన సంగతి తెలిసిందే. 2019 జనవరి 30వ తేదీన జూబ్లీ హిల్స్‌లో గల అతని ఇంటి నుంచి రాకేష్ రెడ్డి తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారిద్దరి మధ్య ఆర్ధిక లావాదేవీల గురించి గొడవ జరిగింది. తర్వాత జయరాంను నిర్భందించి రాకేష్ రెడ్డి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహాదారిలో నందిగామ సమీపంలో పడవేశాడు. ఈ కేసులో రాకేష్ రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నాడు. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ బెదిరింపులు అన్ని రాకేష్ రెడ్డి చంచల్ గూడ జైలు నుంచే చేస్తున్నాడు.

సో ఎక్కడ ఉన్నా.. వార్నింగ్ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ సారి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌నే బెదిరించడం కలకలం రేపుతోంది. అంటే తమ జోలికి వస్తే ఎవరినీ కూడా ఉపేక్షించబోమని వారు సంకేతాలను ఇస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+