సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాల వెల్లువ: రామోజీరావు రూ.5 కోట్ల విరాళం.. ఎన్ శంకర్ కూడా..
వర్ష బీభత్సంతో విశ్వనగరి భాగ్యనగరంపై తీవ్ర ప్రభావం చూపింది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికీ వరదనీరు చేరింది. నీరు చేరడంతో చాలా మంది నిలువనీడ లేకుండా పోయారు. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రముఖులు కూడా విరాళాలు అందజేస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవాలని తెలంగాణ సీఎంవోకు విరాళాలు ఇస్తున్నారు.
ఇప్పటికే పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు విరాళాలు అందజేశారు. తాజాగా రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు స్పందించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. చెక్‌ను రామోజీ గ్రూపు సంస్థల ప్రతినిధి మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. వరద బీభత్సం సృష్టించడంతో పెద్ద మనసుతో సాయం చేసిన రామోజీరావుకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

Recommended Video
రామోజీరావు తర్వాత దర్శకుడు ఎన్ శంకర్ కూడా విరాళం అందజేశారు. సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. చెక్‌ను శంకర్ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. శంకర్‌ను కూడా మంత్రి కేటీఆర్ అభినందించారు. వీరే కాక చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ తలా రూ. కోటి, నాగార్జున రూ.50 లక్షలు ఇస్తున్నామని ప్రకటించారు. విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, సంపూర్ణేశ్ బాబు రూ.50 వేల విరాళం ప్రకటించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications