Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘రెబల్’ స్టార్ అస్తమయం, మంచితనానికి మారుపేరు, ప్రముఖుల నివాళి

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇక లేరు. ఇవాళ తెల్లవారుజామున ఆయన తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో గచ్చిబౌలిలో గల ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గతనెల 5వ తేదీన ఆయన ఆస్పత్రిలో చేరగా.. ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వెంకయ్య సంతాపం..

కృష్ణంరాజు మృతిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మంచి తనానికి మారు పేరుగా అనేక మంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

వ్యక్తిగతంగా లోటు: కిషన్ రెడ్డి

కృష్ణంరాజు ఇకలేరని తెలిసి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పాత్రికేయుడిగా ప్రస్థానం ప్రారంభించి.. నటుడిగా, కేంద్ర మంత్రిగా, పారిశ్రామిక వేత్తగా అవకాశం వచ్చిన ప్రతిచోటా తనదైన ముద్రవేసుకున్నారని గుర్తుచేశారు. నటుడిగా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్నారు. ఆయన మృతి బీజేపీకి, వ్యక్తిగతంగా తనకు.. చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు.

తీరని లోటు: కేసీఆర్

కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్‌గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

వేదనకు గురిచేసింది: కేటీఆర్

కృష్ణంరాజు మరణ వార్త ఎంతో బాధ కలిగించిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అత్యంత పాపులర్ స్టార్లలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒకరని చెప్పారు. కుటుంబ సభ్యులకు స్నేహితులకు సంతాపం తెలియజేశారు.

ఆప్యాయంగా ఉండేవారు: పవన్ కల్యాణ్

ఆప్యాయంగా ఉండేవారు: పవన్ కల్యాణ్

కృష్ణంరాజు మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 'భక్త కన్నప్ప'లో శ్రీ కృష్ణంరాజు అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు. ఇతర సినిమాలు ఆయన నటన విశ్వరూపాన్ని చూపాయని గుర్తుచేశారు.

ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం: రేవంత్ రెడ్డి

కృష్ణంరాజు మృతిపై టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని.. ఆయన మరణం టాలీవుడ్ కు తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

చిరంజీవి దిగ్భ్రాంతి


కృష్ణంరాజు మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం అని అన్నారు. మా ఊరి హీరో అని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో తన తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజుతో చేసిన సినిమాలను గుర్తుచేశారు.'రెబల్ స్టార్'కి ఆయన నిజమైన నిర్వచనం అని చిరంజీవి అన్నారు. ప్రభాస్, కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

స్నేహితుడిని కోల్పోయా: రఘురామ

స్నేహితుడిని కోల్పోయా: రఘురామ

కృష్ణంరాజు మృతి పట్ల వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంతాపం తెలిపారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే కృష్ణంరాజు మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. మంచి స్నేహితుడిని, సన్నిహితుడిని కోల్పోయానని అన్నారు. కృష్ణంరాజుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+