‘ప్రాజెక్ట్ కె’.. ప్రభాస్ ఫస్ట్‌లుక్ కేక..
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K). ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో అంటూ ఇన్నాళ్లుగా సినీ ప్రియులంతా ఎదురుచూశారు. ఇప్పటికే దీపికా పదుకొణె లుక్‌తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై చిత్ర బృందం ఆసక్తి రేకెత్తించింది. తాజాగా ప్రభాస్ లుక్‌ను విడుదల చేసింది. సూపర్ హీరోలా డిజైన్ చేసిన ప్రభాస్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమెరికాలో 'ప్రాజెక్ట్ కె' సందడి మొదలైంది. కామిక్ కాన్ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా చరిత్ర సృష్టించబోతోంది. ప్రతిష్ఠాత్మకమైన 'శాన్ డియాగో కామిక్ కాన్' ఈవెంట్లో ఈ చిత్ర బృందం పాల్గొనబోతోంది. ఇప్పటికే ప్రభాస్, రానా, కమల్ హాసన్ అక్కడకు చేరుకున్నారు. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ బుధవారం వెళ్లనున్నారు.

అదే వేదికపై ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా రిలీజ్ డేట్‌పై యూనిట్ స్పష్టతనివ్వబోతోంది. మరో కీలక పాత్రలో దిశా పటానీ కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.
ప్రాజెక్ట్ కే 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 28వ తేదీన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన సలార్ సినిమా విడుదల కాబోతోంది. సలార్ పై ప్రభాస్ అభిమానులతోపాటు సినీ ప్రియులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ ను మాస్ హీరోగా పూర్తిస్థాయిలో వాడుకుంటే ఎలా ఉంటుందనేదానికి నిదర్శనమే సలార్ అని, ఈ సినిమా రెండు భాగాలు కేజీఎఫ్ ను మించి సూపర్ హిట్ అవుతాయని భావిస్తున్నారు.
సెప్టెంబరు 7వ తేదీన షారుక్ ఖాన్ జవాన్ చిత్రం విడుదల కాబోతోంది. విడదల తేదీలు వేర్వేరైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్, షారుక్ ఖాన్ అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. జవాన్, సలార్ అభిమానుల అంచనాలను అందుకుంటాయా? లేదా? అనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.












Click it and Unblock the Notifications