హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పబ్‌లోకి ఎంట్రీ ఆశామాషీ కాదు.. యాప్‌లో రిజిస్ట్రేషన్, ఓటీపీ చెబితేనే ఎంట్రీ

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు అంతా ఒక్కటే చర్చ.. పబ్ డ్రగ్స్ గురించే డిస్కషన్.. అయితే అదీ హైఫై.. అంటే కోడ్ తెలిసిన వారికే ఎంట్రీ ఉంటుందట.. ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పబ్‌లో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అంతా హైటెక్ పద్ధతిలో సాగిపోతుంది. పబ్‌లోకి వెళ్లాలంటే కోడ్ కంపల్సరీ అని తేలింది. యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న కస్టమర్లకు కోడ్ పంపిస్తున్న నిర్వాహకులు.. అది చెబితేనే ఎంట్రీ ఇస్తున్నారు.

 register via app, while go to pub must say otp

బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్‌ పబ్‌కు వెళ్లాలంటే సీక్రెడ్ కోడ్ తప్పనిసరి. అందులో అందరిని పబ్‌లోనికి అనుమతివ్వరు. యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని... ఓటీపీ వచ్చిన తర్వాత పబ్‌ లోకి ఎంట్రీ అయ్యే సమయంలో కోడ్ ఎంటర్‌ చేస్తేనే నిర్వాహకులు అనుమతిస్తున్నారు. పుడ్డింగ్ అండ్ మింక్‌ పబ్‌లో 5 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు. రైడ్ చేసిన సమయంలో పబ్‌లో మొత్తం 148 మంది ఉన్నారని చెప్పారు. బార్‌ కౌంటర్‌లో కూడా డ్రగ్స్ ఉంచి సరఫరా చేస్తున్నారని తెలిపారు. కొకైన్‌ను డ్రింక్‌లో వేసుకుని తాగినట్లు గుర్తించామని చెప్పారు.

డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి..? ఎవరు సరఫరా చేస్తున్నామో ఆరా తీస్తున్నామన్నారు. తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌గా చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. హైదరాబాద్‌ సిటీలో వరుసగా బయటపడుతున్న డ్రగ్స్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రగ్స్ దందాపై ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారు.
డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరిని విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడిది..? మీకు ఎవరూ సరఫరా చేశారు..? అన్న దానిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూపీ లాగుతున్నారు.

అరెస్టైన వారిలో పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌, ఈవెంట్ మేనేజర్ అనిల్ ఉన్నారు. హైదరాబాద్‌ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏసీపీ నర్సింగరావు, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనాథ్ రంగంలోకి దిగి కేసు విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ కలకలంపై హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్‌ పోలీసు అధికారులతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెస్ట్‌జోన్‌ పరిధిలోని ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు.. డిటెక్టివ్‌ ఇన్స్‌పెక్టర్లను రిపోర్ట్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.

English summary
register via app, while go to pub must say otp police revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X