హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏందిది.. స్టార్ క్యాంపెయినర్ తమ్ముడు పార్టీ వీడితే ఎలా.. రాజగోపాల్ ఇష్యూపై వీహెచ్

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావిడి నెలకొంది. ఇప్పటినుంచే నేతలు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది. తమ సీటు గురించి ఆలోచిస్తున్నారు. మరికొందరు పోటీ గురించి కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి సంవత్సరం పైగా సమయం ఉన్నా.. కొందరు మాత్రం అప్పుడే చేరికలకు సిద్దం అవుతున్నారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటంపై చర్చ జరుగుతుంది. ఆయన హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో ఊహాగాలకు మరింత బలం చేకూరింది. అయితే దీనిని కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఖండిస్తున్నారు.

 వీహెచ్ రియాక్షన్

వీహెచ్ రియాక్షన్


నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడియో కాషాయ కండువా కప్పుకోవటం ఖాయం అయిపోయింది. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ వీడటంపై సీనియర్ నేత వీహెచ్ స్పందించారు.

పార్టీ వీడితే ఎలా..?

పార్టీ వీడితే ఎలా..?


తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లిపోతే ఎలా అని వీహెచ్ ప్రశ్నించారు. స్టార్ క్యాంపెయినర్ తమ్ముడే పార్టీని వదలి వెళ్లిపోతుంటే ఇక ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం ఏముంటుంది? అని అడిగారు. ఎలాంటి అనుమానాలు కలుగుతాయో అని ఆలోచింకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. దీనిపై సీనియర్లు ఆలోచించాలని.. రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని సూచించారు. లేదంటే మిగతా నేతలు కూడా క్యూ కడుతారని.. దీంతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని చెప్పారు.

 నచ్చజెప్పాలి కదా..

నచ్చజెప్పాలి కదా..


నల్లగొండ అంటేనే కాంగ్రెస్ అంటారు. నల్లగొండ కాంగ్రెస్‌లో లుకలుకలు వచ్చి ఇలా పార్టీని వీడి వెళ్లిపోతే ఎలా అని అడిగారు. పదవులు ఇచ్చిన పార్టీకి నష్టం కలిగించి వెళ్లిపోవటం సరికాదని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడే విషయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించాలని వీహెచ్ సూచించారు. రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా స్పందించి తమ్ముడికి నచ్చ చెప్పాలని కోరారు.

 ఇదివరకే రూమర్స్.. కానీ

ఇదివరకే రూమర్స్.. కానీ


నిజానికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటిముట్టగట్టుగానే ఉంటున్నారు. ఇప్పుడే కాదు గత కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి.. ఆయన బీజేపీలో చేరతారని ఇదివరకే ప్రచారం జరిగింది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు పార్టీ వీడేది నిజమేనని కన్ఫామ్ అయ్యింది. ఆయన ఎప్పుడూ ఎక్కడ పార్టీలో చేరతారనే అంశంపై మాత్రం స్పష్టత లేదు.

English summary
senior congress leader v hanumantha rao reacts about rajagopal reddy to join bjp
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X