మైనర్లు అనేది ముఖ్యం కాదు.. నేరమే ఇంపార్టెంట్, జూబ్లీహిల్స్ రేప్ ఘటనపై సోనూ సూద్
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిందితులు మైనర్లు అయినా.. వారు చేసిన పని మాత్రం నీచమైనదని జాతి అంటోంది. నిందితులను మైనర్లుగా పరిగణించొద్దు అని పలువురు సూచిస్తున్నారు. ఆ జాబితాలో సినీ నటుడు సోనూ సూద్ కూడా చేరారు. కరోనా కాలంలో.. సాయం చేయాలని కోరితే.. సోనూ సూద్ ఆపన్న హస్తం అందించారు. రియల్ లైఫ్ హీరోగా నిలిచారు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్ రేప్ కేసుపై సోనూసూద్ స్పందించారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని న్యూస్‌లో చూసి షాక్‌కు గురయ్యానని చెప్పారు. ఇది చాలా పెద్ద నేరమని.. అత్యాచారానికి పాల్పడింది మేజర్లా లేక మైనర్లా అనేది ముఖ్యం కాదన్నారు. వారు ఎలాంటి నేరం చేశారనేదే ముఖ్యమని చెప్పారు. ఇలాంటి నేరాలకు పబ్‌లు కారణం అవుతున్నాయని అనడం సరైంది కాదని సోనుసూద్ అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. మనం ఆలోచించే విధానంలోనే మార్పు రావాలని అన్నారు. మహిళలు పొట్టి బట్టలు వేసుకున్నారని విమర్శిస్తున్నారని... మనం ఆలోచించే విధానం సరిగా లేనప్పుడు మనకు తప్పుడు ఆలోచనలే వస్తాయని చెప్పారు. ముందు మన థింకింగ్ మారాలని సూచించారు.

ఇటు బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నాయని. దీనిపై నిందితులను పోలీసులు ఆరా తీశారు. బాలిక మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలు అయ్యాయి. బాలిక మెడపై టాటూలా ఉండాలనే, మెడపై కొరికినట్లు నిందితులు తెలుపడం విశేషం. మరోవైపు పబ్‌లో బాలికను పరిచయం చేసుకునప్పటి నుండి ట్రాప్‌లోకి దించడం, అత్యాచార ఘటన, మరుసటి రెండు రోజుల వరకు ఏం జరిగింది, ఎక్కడికి పరార్ అయ్యారు, ఎవరి సహాయంతో రాష్ట్రం దాటారు.. ఇలా అనేక కోణాల్లో పోలీసులు విచారించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications