Hyderabad: హైదరాబాద్‍లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. కొంపల్లిలో ఒకే రోజు ఆరుగురిపై దాడి..
హైదరాబాద్‍లోని కొంపల్లిలో ఆరుగురిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.
హైదరాబాద్ మహా నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పిల్లలు, పెద్దలని తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. తాజాగా కుత్బుల్లాపూర్ కొంపల్లిలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని కరిచాయి. నడుచుకుంటూ వెళుతున్న వాళ్లపైనే కాకుండా బండ్లు, సైకిళ్లపై కూడా దాడి చేశాయి. కొంపల్లిలో ఒకే రోజు ఆరుగురిపై వీధి కుక్కల దాడి చేశాయి. దీంతో ప్రజలు రాత్రి పూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

ఫిర్యాదు చేసినా
వీధి కుక్కల దాడిపై జీహెచ్ఎంసీకి కంప్లయింట్స్ చేస్తున్నా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అంబర్ పేటలో బాలుడిపై కుక్కలు దాడి చేశాయి చంపాయి. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తీరు వల్లే ఇలా జరిగిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గంగాధర్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. నాలుగేళ్లుగా అంబర్ పేట ఛే నెంబర్ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఆయనకు భార్య జనప్రియ, ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారు బాగ్ అంబర్ పేటలోని ఎరుకల బస్తీ ఉంటున్నారు. ఆదివారం పిల్లలకు సెలవు కావడంతో కుమార్తె, కొడుకు ప్రదీప్ ను తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ కు తీసుకొచ్చాడు. బిడ్డను పార్కింగ్ వద్ద ఉన్న క్యాబిన్ లో ఉంచి.. కుమారుడిని లోపలికి తీసుకెళ్లాడు గంగాధర్.

ప్రదీప్ పై దాడి
ఏదో పనిపై గంగాధర్ మరో వాచ్ మెన్ తో కలిసి బయటకు వెళ్లాడు. ప్రదీప్ కు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్లాడు. ప్రదీప్ అక్కడే ఉండక.. పార్కింగ్ వద్ద ఉన్న అక్క వద్దకు బయల్దేరాడు. ఈ క్రమంలో బాలుడు నడిచి వస్తుండగా.. కుక్కలు మీదికి వచ్చాయి. ప్రదీప్ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. కుక్కలు వదిలిపెట్టలేదు. ప్రదీప్ పై దాడి చేశాయి. అయితే ప్రదీప్ అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి కుక్కలను వెళ్లగొట్టారు.

సీసీ కెమెరా దృశ్యాలు
వెంటనే అక్కడికి చేరుకున్న గంగాధర్ కుమారుడిని ఆస్పత్రికి తరలించాడు. కానీ ప్రదీప్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో ప్రదీప్ ప్రాణాలు విడిచాడు. బాలుడిపై కుక్కలు దాడి చేసే ఘటన దృశ్యాలు అక్కడే సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కొడకు మృతితో గంగాధర్ కన్నీరుమున్నరయ్యారు. అనవసరంగా పిల్లలను ఇక్కడి తీసుకొచ్చానని బోరున విలపించారు.
-
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
విశ్వాసం అంటే ఇది.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేస్తే 130కి.మీ వెంట నడిచిన శునకం! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications