భార్గవి మిస్సింగ్: కాచిగూడ, పంజాగుట్ట, మలక్ పేటలో నడుచుకుంటూ..
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్గవి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఈ నెల 10వ తేదీన బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తానని చెప్పి భార్గవి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. సాయంత్రం నుంచి భార్గవి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వెతికారు. ఫలితం లేకపోవడంతో భార్గవి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలను నిశీతంగా పరిశీలిస్తున్నారు. కాచిగూడ, పంజాగుట్ట, మలక్ పేట్ ప్రాంతాల్లో భార్గవి నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో భార్గవి రూ.6వేలు తనతో తీసుకెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ కి వెళ్లిన భార్గవి అక్కడ రైలు ఎక్కలేదు. తిరిగి పంజాగుట్ట వరకు వచ్చినట్లు సీసీ కెమెరాల ఆధారంగా తెలుస్తోంది.
మళ్లీ పంజాగుట్ట సెంట్రల్ దగ్గర బస్సు ఎక్కడానికి భార్గవి ప్రయత్నించినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అక్కడి నుంచి మళ్లీ ఆటోలో మలక్ పేట్ వరకు వెళ్లిందని, మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ వద్ద తన ఫోన్ పడేసినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. భార్గవి మిస్సింగ్ కేసు దర్యాఫ్తు మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా చేస్తున్నారు పోలీసులు.

ఏడాది క్రితమే భార్గవికి వివాహమైంది. ఆమె దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవని భార్గవి తల్లిదండ్రులు అంటున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భార్గవి ఎక్కడుంది? ఏమైంది? అనేది తెలియక కంగారు పడుతున్నారు. పోలీసులు త్వరగా భార్గవి ఆచూకీ తెలుసుకుని ఆమెను ఇంటికి క్షేమంగా చేర్చాలని కోరుతున్నారు.
భార్గవి ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. ఆమెకు ఏడాది క్రితమే వివాహమైంది. భార్గవి.. భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అనే అంశంపై క్లారిటీ లేదు. మంచి కొలువు చేస్తూ.. ఎక్కడికి వెళ్లిందనే అనుమానం వస్తోంది. భర్త వేధించేవాడా.త.? లేక ఇతర సమస్య ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ భార్గవి కనిపించే వరకు ఇవన్నీ సశేష ప్రశ్నలుగానే మిగులుతాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications