డీఎస్.. కొడుకుని కూడా తీసుకురా.. లేదంటే వద్దు, ఉపయోగం లేదు, వీహెచ్ హాట్ కామెంట్స్
సీనియర్ నేత డీఎస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. దానికి మరింత హైప్ క్రియేట్ చేయడానికి.. ఇటీవల ఆయన సోనియా గాంధీతో సమావేశం అయ్యారు కూడా. అయితే డీఎస్ కాంగ్రెస్‌లో చేరడానికి సీనియర్లు కొందరు అడ్డుకుంటున్నారనే ప్రచారం జరిగింది. సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు బాహాటంగానే విమర్శలు చేశారు. ఒక్క డీఎస్ కాదు అతని కుమారుడు కూడా కాంగ్రెస్‌లో చేరాలని షరతు విధించారు.

రాజ్యసభ ఇస్తారో ఇవ్వరో తెలియదు1
పదవీకాలం ముగుస్తోందని.. మళ్లీ రాజ్యసభ ఇస్తారో లేదో తెలియదు కనుకే.. డీఎస్ పార్టీని వీడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా పదవులకు రాజీనామాలు చేసి రావాలని సూచించారు. డీ శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలపై ఆయన స్పందించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న డి శ్రీనివాస్ పదవులు అనుభవించారని, రెండు సార్లు పీసీసీ పదవీని ఎంజాయ్ చేశారని కామెంట్ చేశారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారని గుర్తుచేశారు.

ఇందూరు కాంగ్రెస్ నేతల నుంచి ఫోన్లు
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల నుంచి ఫోన్లు వస్తున్నా...కష్ట సమయంలో పార్టీని వీడి.. ఇప్పుడు మరలా వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారని వీహెచ్ గుర్తుచేశారు. డీఎస్ పార్టీలో చేరిక వల్ల పార్టీకి ఏమి ఉపయోగం తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో చేసిన తప్పును సరిదిద్దుకున్నా... తన కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అన్నప్పుడు ఆయన కొడుకును కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

కీ రోల్..
గతంలో కాంగ్రెస్ పార్టీలో డీ శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా పనిచేశారు. 2004లో వైఎస్ హాయాంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా... డీఎస్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో.. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2016లో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. పదవీకాలం ఆరు నెలలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

అంటిముట్టనట్టుగా
గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి డీఎస్ దూరంగా ఉంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్..బీజేపీ నుంచి కవితపై పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీతో డీఎస్‌కు సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఇటీవలే కాంగ్రెస్ హై కమాండ్‌తో డీ శ్రీనివాస్ చర్చలు జరిపారు. కానీ పార్టీలో చేరికపై ఎలాంటి క్లారిటీ రాలేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications