South Central Railway: దక్షిణ మధ్య రైల్వే సరికొత్త హెల్ప్ లైన్ నంబర్..!
మీరు రైళ్లల్లో ప్రయాణిస్తున్నారా లేదా రైల్వే టికెట్లు బుక్ చెసుకున్నారా.. లేదా మీకు రైల్వేకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయవచ్చని.. దక్షిణ మధ్య రైల్వే (SCR) తెలిపింది. సెప్టెంబర్ 7న ఫిర్యాదులను చేయడానికి రైల్ మదద్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ఉపయోగించాలని ప్రయాణికులను కోరింది. ప్రయాణీకులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే 139కి డయల్ చేయవచ్చు అని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
వివిధ రకాల ఫిర్యాదులు, విచారణల కోసం బహుళ హెల్ప్‌లైన్ నంబర్‌ల అసౌకర్యాన్ని అధిగమించడానికి ఇది రైలు వినియోగదారులకు సహాయపడుతుందని పేర్కొంది. అంటే గతంలో కూడా హెల్ప్ లైన్ ఉన్నా.. ఫిర్యాదు చేయడానికి చాలా సమయం పట్టేది. అందుకో మరో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబర్ 139.. 12 భాషల్లో అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య తెలిపింది. ప్రయాణీకులు IVRS (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్)ని ఎంచుకోవచ్చు లేదా నంబర్‌ను డయల్ చేయడం ద్వారా కాల్-సెంటర్ ఎగ్జిక్యూటివ్‌కి నేరుగా కనెక్ట్ చేయవచ్చని వివరించింది.

హెల్ప్‌లైన్‌ను SMS ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చని పేర్కంది. ఫిర్యాదును సందేశంగా పంపడం (SMS) లేదా 139కి డయల్ చేయడం ద్వారా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదుదారుకు సహాయం చేస్తారని తెలిపింది. అలాగే రైల్ మదద్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను చేయవచ్చు.
"139 హెల్ప్‌లైన్ (IVRS) మెనులో భద్రత, వైద్య సహాయం ఉన్నాయి. దీని కోసం ప్రయాణికులు 1 నొక్కాలి. వెంటనే కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తో కనెక్ట్ అవ్వాలి. PNR స్థితి, రైలు షెడ్యూల్ మొదలైన వాటి కోసం 2 నొక్కాలి, సాధారణ ఫిర్యాదుల కోసం, 3 నొక్కాలి, టిక్కెట్ రద్దు, వాపసు విచారణల కోసం నొక్కాలి" అని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. దివ్యాంగులకు సంబంధించిన సమాచారం కోసం ప్రయాణికులు 5 నొక్కాలి. విజిలెన్స్ సంబంధిత ఫిర్యాదుల కోసం 6 నొక్కాలి అని తెలిపింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications