వీధి కుక్కల ఇలా చెక్ పెట్టాలి.!నగర వాసులకు జిహెచ్ఎంసి వినూత్న పాఠాలు.!
వీధి కుక్కల దాడులను సమర్థవంతంగా నియంత్రించడానికి జీహెచ్ఎంసీ పకడ్బంధీ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబీస్ ప్రోగ్రామ్ పర్యవేక్షణ కోసం ప్రతి జోన్ కు ఒక జాయింట్ కమిషనర్ ను నియమించింది నగర
హైదరాబాద్: నగర వాసులకు కుక్కల బెడద నుండి విముక్తి కావడానికి జిహెచ్ఎంసి పటి ష్టమైన చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కుక్కల దాడి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఏలాంటి దుర్గటనలు పునరావతం కాకుండా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనశాఖ, జిహెచ్ఎంసి సంయుక్తంగా కుక్కల బెడద నివారణకు మార్గదర్శకాలను జారీ చేశారు. రాష్ట్రంలో కుక్కల దాడులు జరగకుండా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ సూచన మేరకు జీహెచ్ఎంసీ ఈ ప్రణాళిర రచించినట్టు తెలుస్తోంది.

కుక్కలను పట్టుకోవడం కోసం ప్రత్యేక డ్రైవ్‌లు.. జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం
ఇటీవల జరుగుతున్న కుక్కల దాడుల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిహెచ్ఎంసి పేర్కొంటోంది. జిహెచ్ఎంసి పరిధిలో జంతు పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టడం జరుగుతున్నదని, నగరంలో నలువైపులా జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటిని నిర్వహించడం జరుగుతున్నదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల పెంపుడు జంతువుల క్రిమిటోరియాలను కూడా ఆరు జోన్లలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలియజేసారు.

వెటర్నరీ విభాగం అప్రమత్తం.. వీధి కుక్కల స్టెరిలైజేషన్ కు శ్రీకారం..
కుక్కల బర్త్ కంట్రోల్ చేయడానికి, దాంతో పాటు రేబిస్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా అదికారులు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా 30 సర్కిల్లలో 30 వాహనాలను ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్ తో పాటు వ్యాక్షినేషన్ చర్యలు చేయడం జరుగుతుందంటున్నారు. గతంలో కుక్కల గణన, సేకరణ సందర్భంగా ఐదు లక్షల 75 వేల కుక్కలు నగరంలో ఉన్నట్టు గుర్తించారు. అందులో 75 నుండి 80% వరకు బర్త్ కంట్రోల్ చేయడం జరిగిందని, జంతు పరిరక్షణకు జాతీయ యానిమల్ బోర్డ్ మరియు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ వ్యవహరిస్తుందని అధికారులు తెలిపారు.

పాఠశాలల్లో పిల్లలకు, నగర ప్రజలకు శిక్షణ.. అవగాహణ కార్యక్రమంలో జిహెచ్ఎంసి
అంతే కాకవుండా ప్రస్తుతం కుక్కకాటు నివారణకు విస్తృతమైన చర్యలు జిహెచ్ఎంసి చేపట్టింది. ప్రతి ఏడాది కుక్కల గణన చేపట్టాలని నిర్ణయించింది. దీంతో పాటు ఫిర్యాదు వచ్చిన వెంటనే కుక్కలను యానిమల్ కేర్ సెంటర్ కు తీసుకువెళ్లి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. వివిధ వ్యాధులకు గురైన కుక్కలను చికిత్స చేసి నయమయ్యే వరకు జంతు సంరక్షణ కేంద్రంలోని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వాటికి ఎలాంటి ఆహార సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల కళాశాలల్లోని పిల్లలకు, నగర ప్రజలకు కుక్కల ప్రవర్తన, వ్యవహరించడంలో "చేయవలసినవి" మరియు "చేయకూడనివి" సంభందించిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు అధికారులు.

ప్రజలు సహకారం అవసరం.. నగర వాసులకు అధికారుల విజ్ఞప్తి..
కుక్కల దాడుల నివారణకు ప్రజలను అప్రమత్తం చేసేందుకు తగిన కార్యచరణను జిహెచ్ఎంసి ప్రకటించింది. ముఖ్యంగా కుక్కల కాటు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలు తెలుసుకునేందుకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. కుక్క కాటు నివారణకు పాఠశాల, కళాశాల విద్యార్థులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, స్వయం స్వయం సహాయక సంఘాల మహిళలకు, స్లమ్ ఫెడరేషన్ సభ్యులకు అవగాహన కల్పించనున్నారు నగర పాలక సంస్ధ అధికారులు.












Click it and Unblock the Notifications