కేసీఆర్ వల్ల రాష్ట్రానికి నష్టం, మోడీ సభకు హాజరవక పోవడంపై లక్ష్మణ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. రేపు రామగుండం ఎరువు ఫ్యాక్టరీని ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు. ఆ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకావడం లేదు. దీనిని లక్ష్మణ్ తప్పుపట్టారు. ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా దూరంగా ఉన్నారని గుర్తుచేశారు. ఇదీ మంచి పద్దతి కాదని హితవు పలికారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లనుందని వివరించారు. మోడీ రావొద్దని హొర్డింగ్స్ ఎలా పెడతారని లక్ష్మణ్ అడిగారు. ప్రధాని పర్యటనను రాజకీయం ఎలా చేస్తారని ప్రశ్నించారు.

కేసీఆర్ గైర్హాజరు..

కేసీఆర్ గైర్హాజరు..

రేపు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు మోడీ వస్తున్నారు. రామగుండం పర్యటన కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇదీ కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమం.. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. సీఎస్.. ఇతర ఉన్నతాధికారులు వచ్చే అవకాశం ఉంది.

విడ్డూరమే..

విడ్డూరమే..


ప్రధాని మోడీ రాకను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తుండటం విడ్డూరం అని మరో నేత విజయశాంతి అభిప్రాయ పడ్డారు. కార్మిక వర్గాల అభివృద్ధి అని కమ్యూనిస్టులు చెప్పే అంశాలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రగతి సాధించిందని తెలిపారు. వ్యవసాయ - పారిశ్రామిక రంగాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన కోసం రోజ్‌గార్ మేళాలు, ముద్ర లోన్లు, బీమా పథకాలు, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, శ్రమయేవ జయతే, అటల్ పెన్షన్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఉజ్జ్వల ప్లాన్ ఇలా అన్ని వర్గాలకూ ప్రత్యేక పథకాలతో మోదీ సర్కారు విస్తృత ప్రజాదరణ సాధించిందని చెప్పారు.

కార్యకర్తల క్షోభ

కార్యకర్తల క్షోభ


టీఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు కలిసి పనిచేయడంపై గుర్రుమన్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలోకి ప్రధాని రాకను వ్యతిరేకించి.. వారి విలువను మరింతగా తగ్గించుకుంటున్నారని ఫైరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+