Hyderabad: కాసేపట్లో హైదరాబాద్ లో భారీ వర్షం..!
హైదరాబాద్ ను మబ్బులు కమ్మేశాయి. నగరంలో ఉదయం నుంచి పొడి వాతావరణం ఉంది. మధ్యాహ్నానానికి వాతావరణం చల్లగా మారింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మబ్బులు కమ్మేశాయి. మరి కొద్ది గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గురువారం రోజు కూడా హైదరాబాద్ భారీ వర్షం కురిసింది. ఆ రోజు మధ్యాహ్నం కూడా మబ్బులు భారీగా వచ్చాయి. అప్పుడు కూడా వాతావరణ శాఖ వర్షం కురుస్తుందని హెచ్చరించింది.
ఆ రోజు క్యూములో నింబస్ మేఘాలు రావడం వల్ల భారీ వర్షం కురిసింది. ఈ రోజు కూడా వర్షం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో మే 23 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.

ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలు, కొస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు అగ్నేయ బంగాళాఖాతంలోకి మే 19 రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. మే 31 రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది.
అంత అనుకున్నట్లు జరిగితే జూన్ 6 తర్వాత తెలంగాణలో రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈసారి వర్షలు సాధారణంగా ఉంటుందని.. పలు చోట్లు సాధారణంగా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications