నడిరోడ్డుపై ఆగిన ఆటో.. పరుగులు తీసిన జనం.. అస్సలు ఏం జరిగిందంటే..!

హైదరాబాద్ లోని పాతబస్తీలో భారీ ప్రమాదం తప్పింది. దీంతో అందురూ ఊపిరి పీల్చుకున్నారు. సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారిపై సిలిండర్ల లోడ్ తో ఆటో వెళ్తోంది. ఇంతలో ఆటోలోని ఓ గ్యాస్ సిలిండర్ లీకైంది. గ్యాస్ లీక్ అయినట్లు ఆటో డ్రైవర్ గమనించాడు. వెంటనే అతను ఆటోను రోడ్డుపై వదిలి పెట్టి దూరంగా వెళ్లిపోయాడు. ఆటో వెనకల వస్తున్న వాహనదారులు కూడా గ్యాస్ లీకైనట్లు తెలుసుకుని వారి వాహనాలను నిలిపి దూరంగా వెళ్లిపోయారు. దీంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.సిలిండర్ గ్యాస్‌ లీకైన సమయంలో ఆటోలో 12 పెద్ద సిలిండర్లు ఉన్నాయి. వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి లీకైన గ్యాస్ సిలిండర్ సరిచేశారు. మిగతా సిలిండర్లను కిందకు దింపారు. ఆ తర్వాత ట్రాఫిక్ ను క్రమబద్ధికరించారు. ప్రమాదం తప్పడంతో అక్కడున్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు.

traffic jam due to the gas leak in Pata Basti Auto in Hyderabad

మరో 11 మంది గాయపడ్డారు. అయితే సిలిండర్ లీక్ ఎలా అయిందో విచారణ చేపట్టారు. వారం క్రితం పంజాబ్‌లోని లూథియానాలో గోయల్ మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. అయితే సిలిండర్లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో సిలిండర్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని చెబుతున్నారు. గ్యాస్ లీక్ అయి అనేక మంది చనిపోయిన ఉదంతాలు ఉన్నాయి. 2017లో 309 సిలిండర్లు పేలాయి. 315 చనిపోగా.. 84మంది గాయపడ్డారు.

2018లో 307 సిలిండర్స్ బ్లాస్ట్‌ అయ్యాయి. 318 చనిపోగా.. 41 మంది గాయపడ్డారు. 2019లో 314 ప్రమాదాలు జరగ్గా.. 330 మంది చనిపోయారు. 59 మంది గాయపడ్డారు. 2020లో 245 సిలిండర్లు బాంబుల్లా పేలాయి. మృతుల సంఖ్య 254గా ఉంది. మరో 66 మంది గాయపడ్డారు. గ్యాస్‌ బండల భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, లీకేజీలపై ఏమరుపాటు ప్రాణాలు తీస్తున్నాయని అందుకే జాగ్రత్తగా ఉండాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+