hyderabad: టోలిచౌకిలో విషాదం.. విద్యుత్ షాక్‍తో ముగ్గురు యువకుల మృతి..
కరెంట్ షాక్ తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఓ యువకుడు నీళ్లు తోడేందుకు బకెట్ ను సంప్ లోకి వేయగా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. అతన్ని కాపాడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా కంరెట్ షాక్ తో మృతి చెందారు. టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో మహ్మద్ రజ్వాన్, మహ్మద్ రజాక్ సోదరులు నివాసం ఉంటున్నారు. రిజ్వాన్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతన్నాడు. రజాక్ పదో తరగతి చదువుతున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి రూమ్ లో వాటర్ రాలేదు. పైకి వెళ్లి చూస్తే ట్యాంక్ లో నీళ్లు అయిపోయాయి. దీంతో మోటార్ వేశాడు.
అయినా నీళ్లు రాకపోవడంతో నీటిని తోడేందుకు రిజాక్ బకెట్ ను సంప్ లోకి దించాడు. అయితే అప్పటికే మోటర్ వేసి ఉండడంతో రజాక్ కరెంట్ షాక్ కొట్టింది. గమనించిిన రిజ్వాన్ రజాక్ కాపాడే ప్రయత్నం చేశాడు. అతను విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. 10 నిమిషాలు అయినా రజాక్, రిజ్వాన్ పైకి రాకపోయేసరికి వారి స్నేహితుడు సయ్యద్ అనసుద్దీన్ హుస్సేన్ కింద ఉన్న సంప్ వద్దకు వచ్చాడు. రిజ్వాన్, రజాక్ పడిపోయి కనిపించారు. వారి పట్టుకోగా.. హుస్సేన్ కూడా కరెంట్ కొట్టి మృతి చెందాడు.

ఉదయం ఇంటి ఓనర్ చూసేసరికి ముగ్గురు మృతి చెంది కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకు విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘనటలో ముగ్గురు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. అన్నదమ్ములు ఇద్దరూ కొద్ది రోజుల క్రితమే ఇంటర్, 10వ తరగతి పరీక్షలు రాసి ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో వారు మృతి చెందడం కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications