హనుమాన్ జయంతి.. సిటీలో శోభాయాత్ర, ట్రాఫిక్ డైవర్షన్ ఇలా..

హనుమాన్ జయంతి.. జయంతిని పురష్కరించుకొని నిర్వహించే శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. శోభాయాత్ర సందర్భంగా పలు ఆంక్షలు కూడా అమలు చేస్తారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర సాగనుంది. 24 గంటల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్స్, కల్లు కాంపౌండ్ మూసివేస్తారు. కానీ స్టార్ హోటళ్లు, పబ్బులకు దాని నుంచి మినహాయింపు ఉంటుంది.

ట్రాఫిక్ ఆంక్షలు..

ట్రాఫిక్ ఆంక్షలు..


హనుమాన్ శోభా యాత్ర సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 21 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించి డైవర్షన్ రూట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఏయే రూట్లలో వెళ్లాలో సూచించారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామ మందిరం నుంచి హనుమాన్ శోభా యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. రాత్రి 8 గంటలకు తాడ్ బండ్ లోని హనుమాన్ టెంపుల్ కు చేరుకుని ముగుస్తుందని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి 2 గంటలు.. , మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల మధ్య వెళ్లాల్సిన రూట్ల వివరాలను పేర్కొన్నారు.

 డైవర్షన్

డైవర్షన్


లక్డీ కా పూల్ నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్లాలనుకునే వారు.. బషీర్ బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణ గూడ ఫ్లై ఓవర్, బర్కత్ పుర, ఫీవర్ హాస్పిటల్, రైట్ టర్న్ తిలక్ నగర్ రోడ్, 6 నం జంక్షన్, అలీ కేఫె క్రాస్ రోడ్, మూసారాంబాగ్ మీదుగా దిల్ సుఖ్ నగర్ వెళ్లాలి. దిల్ సుఖ్ నగర్ నుంచి మెహిదీపట్నం వెళ్లాలనుకునేవారు.. ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ ఓఆర్, చాంద్రాయణ గుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా మెహిదీపట్నం వెళ్లాలని సూచించారు.

 ఇలా చేరుకొండి..

ఇలా చేరుకొండి..


లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ లేదా ఉప్పల్ వెళ్లే వారు వీవీ స్టాట్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట ఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, పారడైజ్ ఫ్లై ఓవర్ మీదుగా ఉప్పల్ వెళ్లవచ్చు. ఆయా రూట్లకు తగిన విధంగా ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. శోభాయాత్ర సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+