సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం.. PhD విద్యార్థిని బాత్రూమ్‌లో అనుమానస్పద మృతి..!
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఖరగ్‌పూర్ ప్రాంతానికి చెందిన 29 సంవత్సరాల దీపికా మహాపాత్ర హిందీ విభాగంలో డాక్టరేట్ చేస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బాత్రూమ్‌లో చనిపోయినట్లు తోటి స్నేహితులు గుర్తించారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో వర్సిటీకి చేరుకున్నారు.
గత కొంతకాలంగా ఆమె న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే బాత్రూమ్‌కు వెళ్లిన దీపికా కళ్లు తిరిగి పడిపోయి ఉండొచ్చని సమాచారం. ఆ క్రమంలోనే ఆమె చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె బాత్రూమ్‌కు వెళ్లి చాలాసేపవుతున్నా.. ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థినులు వెళ్లిచూడగా అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం.
Recommended Video


దాంతో వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే దీపిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ మేరకు దీపికకు సంబంధించిన పాత మెడికల్ రిపోర్టులతో పాటు తోటి స్నేహితులను వారి బంధువులను విచారించడంతో ఆమె న్యూరో సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. అయితే పూర్తి దర్యాప్తు తర్వాత అసలేం జరిగిందనే క్లారిటీ వచ్చే అవకాశముంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications