హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జేసీపై వీహెచ్ ఫైర్: కేసీఆర్ కోవర్టు గుస్సా..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎల్పీలో కూర్చొని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీపై జేసీ దివాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ తన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో చూసుకోవాలని తెలంగాణలో కాదని విమర్శించారు.

తాజా మాజీ సీఎంకు భారీ షాక్ -పుదుచ్చేరి అసెంబ్లీ కాంగ్రెస్ జాబితాలో నారాయణస్వామికి మొండిచెయ్యితాజా మాజీ సీఎంకు భారీ షాక్ -పుదుచ్చేరి అసెంబ్లీ కాంగ్రెస్ జాబితాలో నారాయణస్వామికి మొండిచెయ్యి

 జేసీ ఎవరూ..?

జేసీ ఎవరూ..?

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో జానారెడ్డి ఓడిపోతాడని చెప్పడానికి జేసీ ఎవరని వీహెచ్ ప్రశ్నించారు. జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ఇలా మాట్లాడితే కార్యకర్తలు తిరగబడతారని హెచ్చరించారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్ కోవర్ట్ అని అర్థమవుతోందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. జేసీ తన రాజకీయ బలాన్ని జగన్‌పై చూపుకోవాలని సూచించారు.

అనంతపూర్.. రాయలసీమ...

అనంతపూర్.. రాయలసీమ...

జేసీ దమ్మున్న లీడర్ అయితే అనంతపూర్‌ లేదంటే రాయలసీమలో చూపించుకోవాలని వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటు భట్టి, జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి‌పై అధిష్టానానికి కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోనియా, రాహుల్‌ను జేసీ తిట్టిపోసినా నేతలు అడ్డుకోలేదని విమర్శించారు. జానారెడ్డి ఓడిపోతాడని జేసీ చెప్పినా స్పందించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అగ్గిరాజేసిన కామెంట్స్

అగ్గిరాజేసిన కామెంట్స్

తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసిందని.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదని జేసీ కామెంట్ చేశారు. వేరే దారి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని.. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ అక్కడా ఇక్కడా లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లిందన్నారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి గెలువలేడని జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
congress leader v hanumantha rao slams tdp leader jc diwakar reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X