Anasuya: జిమ్‌లో అనసూయ అందాల విందు.. వర్కౌట్స్ ఇలా కూడా చేస్తారా..? వీడియో వైరల్
యాంకర్ అనసూయ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. అటు సినిమాలు, ఇటు టెలివిజన్ షోలు చేస్తూ ఈ అమ్మడు ఫుల్ బీజీగా మారిపోయింది. ముఖ్యంగా 'రంగస్థలం' సినిమాతో అనసూయ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. రంగమ్మత్తగా అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 'రంగస్థలం' తరువాత ఆమెకు సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. పుష్ప'లో విలన్‌గా 'విమానం' సినిమాలో వేశ్య పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.
తన నటనతో ఎంతటి ప్రశంసలు దక్కించుకుందో..వివాదాలతో కూడా అదే రీతిలో విమర్శలను ఎదుర్కొంది.హీరో విజయ్ దేవరకొండ అభిమానులతో అనసూయ గొడవ గురించి అందరికి తెలిసిన విషయమే. ఇటీవలే వీరిద్దరు తమ మధ్య గొడవ గురించి ఓపెన్‌గా మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఇద్దరు పిల్లల తల్లైనప్పటికీ మోడ్రన్ డ్రెస్‌లు వేసుకోవడంపై నెటిజన్లు అనసూయపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఇక తన పెళ్లి రోజున భర్త భరద్వాజ్‌తో బీచ్‌లో దిగిన ఫోటోలపై కూడా నెటిజన్లు అనసూయను గట్టిగానే ట్రోల్ చేశారు. విపరీతమైన పోటీతత్వం ఉన్న ఈ రోజుల్లో ...అందులోనూ గ్లామర్ ఫీల్డ్‌లో ఫిజిక్‌ను మెయిన్‌టైన్ చేయడం అంటే మమూలు విషయం కాదు. కాస్తా బొద్దుగా కనిపించిన విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే అనుసూయ ఎప్పటికప్పుడు తన బాడీని ఫిట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుటుంది. సినిమా , షోలకు సంబంధించి షూటింగ్ గ్యాప్ వచ్చిందంటే చాలు.. జిమ్‌లో తెగ కష్టపడిపోతుంటుంది.

తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఆమె బరువైన కసరత్తులు చేయడం ఈ వీడియోలో కనిపించింది. తల్లైనా కూడా ఫిట్ నెస్‌తో కనిపించేందుకు అనసూయ జిమ్‌లో కసరత్తులు చేయడాన్ని నెటిజన్లు ప్రసంశిస్తున్నారు. జిమ్‌లో అనసూయ పడుతున్న కష్టాలకు వారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ అనసూయ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













Click it and Unblock the Notifications