హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

video:కేసీఆర్‌తో పెట్టుకుంటే అట్ల ఉంటది, చీరలను కాల్చి, తర్వాత కండువా వేసుకొని

|
Google Oneindia TeluguNews

దసరా ముందు బతుకమ్మ.. పూలనే కొలిచే సాంప్రదాయం తెలంగాణలో ఉంది. బతుకమ్మనే గౌరమ్మ అని కూడా అంటారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బతుకమ్మను కూడా రాష్ట్ర పండుగగా గుర్తించారు. పండగ సందర్భంగా చీరలను కూడా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే తొలి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.

చీరలపై విమర్శలు

చీరలపై విమర్శలు


ఈ సారి కూడా విమర్శలు వస్తున్నాయి. చీర కోసం రూ.300 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే అవీ బాగోలేవని అంతా అంటున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఓ లంబాడీ మహిళ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఆయన భార్య, కూతురు ఇలాంటి చీర కట్టుకుంటారా అని దుమ్మెత్తి పోశారు. ఒకడుగు ముందుకేసి మరీ చీరలను కాల్చివేశారు.

స్టేటస్ పెట్టుకొని..


ఆ వీడియోలను చాలా మంది షేర్ చేశారు. కొందరు స్టేటస్ కూడా పెట్టుకున్నారు. అంతలో ఏం జరిగిందో తెలియదు. నానా హంగామా చేసిన మహిళలో మార్పు వచ్చింది. తనకు కేసీఆర్ అంటే ఎంతో అభిమానం అని చెప్పుకొచ్చింది. రైతు బంధు, ఇతర పథకాలతో తమకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను తాను అలా అనలేదని.. ఆ వీడియో ఎవరో సృష్టించారని తెలిపారు. ఇంతలోనే ఎంత మార్పు అనే సందేహాం కలిగింది.

కేసీఆర్‌తో పెట్టుకుంటే అట్ల ఉంటది


కొందరు కేసీఆర్‌తో అలా ఉంటది అని అంటున్నారు. అవును ఆయనతో పెట్టుకుంటే అంతే సంగతులు అనేస్తున్నారు. మీరు ఎలా ఆయనతో పెట్టుకుంటారని అడుగుతున్నారు. అంతలోనే మార్పు వచ్చింది కదా అని అంటున్నారు. నిజమే.. పెద్దలను నోటికొచ్చినట్టు అనకూడదు.. అంటే ఇలా మార్పు రావాల్సి వస్తోంది.

English summary
a woman fire on batukamma sarry and burned. later she join trs party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X