Hyderabad: హైదరాబాద్ లో టీ, కాఫీ ఏటీఎం.. ఎక్కడంటే.. !
మనకు డబ్బు అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకులు ఓపెన్ చేసి ఉండవు. అందుకే ఏటీఎంలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఏటీఎంలు డబ్బుకే కాదు.. నీళ్లకు, బంగారానికి, మద్యానికి, టీ, కాఫీకి కూడా వచ్చాయి. తాజాగా హైదరాబాద్ లో
టీ, కాఫీ, నీళ్ల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ గురువారం ప్రాంభించారు. ఈ యంత్రం పూర్తిగా ఆటోమేటెడ్. ఇందులో బిస్కెట్లను కూడా తీసుకొవచ్చు.
Gem Opencube technologies pvt ltd రూపొందించిన ప్రపంచంలోని 1వ నీరు, టీ, కాఫీ (WTC) ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 14, 2023న హైదరాబాద్ హైటెక్ సిటీలోని అవసా హోటల్‌లో రాష్ట్ర ముఖ్య ప్రముఖుల సమక్షంలో జరిగింది. అంతర్నిర్మిత వాయిస్ సహాయంతో, వినియోగదారులు QR కోడ్‌ని స్కాన్ చేసి, వారికి కావలసిన ఉత్పత్తిని ఎంచుకోవాలి. "భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో, సాధారణ ప్రజలకు వెండింగ్ మెషీన్లు అందుబాటులో లేవు. ఇక్కడ 100 మందిలో ఒకటి మాత్రమే మాల్స్, మెట్రోలలో ఆటోమేటెడ్ వెండింగ్ మెషీన్లను ఆపరేట్ చేస్తుంది" అని మెషిన్ ఆవిష్కర్త పి వినోద్ కుమార్ చెప్పారు.

బ్యాంకు రుణం, బీమా సౌకర్యంతో రిఫ్రిజిరేటర్ కంటే తక్కువ ధరకే ఈ యంత్రాన్ని మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో బంగారం ఏటీఎం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎంలో గోల్డ్ కాయిన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) చెన్నై మాల్‌లోని ఎలైట్ స్టోర్‌లో అటానమస్ లిక్కర్ వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని మొదటగా చెన్నైలో పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టారు.
తమిళనాడులో మద్యం షాపులను ప్రభుత్వమే నడిపిస్తోంది. మందుల బాబుల సౌకర్యర్థం మద్యం బాటిల్స్ కోసం గంటల తరబడి వేచి ఉండే పనిలేకుండా.. కోక్, పెప్సీల సీసాలను ఓ పెద్ద ఫ్రిడ్జ్ నుంచి ఎలా కొనుగోలు చేస్తామో.. మందు కూడా అలానే కొనుగోలు చేసేలా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ మిషన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications