ICC ODI World Cup 2023 : ఐసీసీ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల-అక్టోబర్ 15న భారత్-పాక్ మ్యాచ్

ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ను బీసీసీఐ ఇవాళ విడుదల చేసింది. దీని ప్రకారం ఐసీసీ ప్రపంచకప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో గత వరల్డ్ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో రన్నరప్ న్యూజీలాండ్ తలపడనుంది. అలాగే 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే లీగ్ మ్యాచ్ తో భారత్ టోర్నీ ఆరంభించనుంది. అనంతరం అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ICC World Cup 2023

అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ వన్డే ప్రపంచకప్ నిర్వహణకు వీలుగా మ్యాచ్ లు ఖరారు చేస్తూ ప్రతిపాదనల్ని బీసీసీఐ ఐసీసీకి పంపింది. వీటిని ఐసీసీ ఆమోదించడం లాంఛనమే. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈసారి మూడు ప్రపంచకప్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్ కు ముంబై, కోల్‌కతా ఆతిధ్యమివ్వబోతున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించబోతున్నారు.

భారీగా పెరిగిన టమాటా ధరలు.. ఆందోళనలో సమాన్యులుకూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమాటా, పచ్చి మిర్చి ధరలు అమాంతం పెరిగిపోయాయిThe prices of vegetables have increased drastically. The prices of tomatoes and green chillies have gone up a lotvegetables, vegetables price, tomato, green chilly, beans, bringers, battle guard, bitter guard, కూరగాయలు, కూరగాయల ధరలు, టమాటా, పచ్చి మిర్చి, బిన్స్, సోరకాయ, బీరకాయ

ఈసారి టోర్నీలో మొత్తం 10 దేశాలు పాల్గొంటున్నాయి. వీటిలో 8 దేశాలు ఇప్పటికే నేరుగా అర్హత సాధించగా.. మరో రెండు దేశాలు క్వాలిఫయర్స్ మ్యాచ్ ల ద్వారా నిర్ణయిస్తారు. మొత్తం 9 నగరాల్లో ఈసారి వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఇందులో కోల్ కతా, ముంబై,ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. 2011లో చివరి సారిగా భారత్ స్వదేశంలో వన్డే ప్రపంచకప్ నెగ్గింది. మరోసారి స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ ను భారత్ విజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి.

వన్డే ప్రపంచకప్ లో భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలు

అక్టోబర్ 8 భారత్-ఆస్ట్రేలియా (చెన్నై)

అక్టోబర్ 11 భారత్-ఆప్ఘనిస్తాన్ (ఢిల్లీ)

అక్టోబర్ 15 భారత్-పాకిస్తాన్ (అహ్మదాబాద్ )

అక్టోబర్ 19 భారత్-బంగ్లాదేశ్ (పూణే)

అక్టోబర్ 22 భారత్-న్యూజీలాండ్ (ధర్మశాల)

అక్టోబర్ 29 భారత్-ఇంగ్లండ్ (లక్నో)

నవంబర్ 2 భారత్ వర్సెస్ క్వాలిఫయర్ (ముంబై)

నవంబర్ 5 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (కోల్ కతా)

నవంబర్ 11 భారత్ వర్సెస్ క్వాలిఫయర్ (బెంగళూరు)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+