అప్‌లోడ్: ఇంటర్నెట్‌లో ప్రతి గంటకు ఓ సెక్స్ వీడియో

బెంగుళూరు: భారత్‌లో ప్రతి గంటకు రహస్య కెమెరాతో చిత్రీకరించిన ఒక సెక్స్ వీడియో ఇంటర్నెట్‌లోని సామాజికి మాధ్యమాల్లోకి అప్‌లోడ్ అవుతుందని ఇటీవలే జరిగిన ఓ సదస్సులో మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు.

బెంగుళూరులో ఇంటర్నెట్‌లో లైంగిక దుర్వినియోగం, భారతీయ మహిళలు, పిల్లలపై ప్రభావం అనే అంశంపై ఇటీవలే జరిగిన సదస్సులో నేషనల్ సైబర్ భద్రత, భద్రతా ప్రమాణాల అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్. అమర్ ప్రసాద్ రెడ్డి ఈ విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లతో పోలిస్తే 2015లో ఎక్కువగా రహస్య కెమెరాతో చిత్రీకరించిన సెక్స్ వీడియోలు ఎక్కువగా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ అవుతున్నాయన్నారు. ఆన్‌లైన్ సెక్స్ గేమ్స్ మరింత ప్రమాదకరంగా మారాయని, ఇవి ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు.

'1 Sex Video From Hidden Camera Uploaded Every Hour'

ప్రతి ఏటా 7200 మంది చిన్నారులు వీటి కారణంగా అత్యాచారానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ అక్రమ కార్యకలాపాలను నిరోధించడానికి ప్రభుత్వం ఐటీ పాలసీలో మార్పులు తీసుకురావాలని సూచించారు.

మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, వీటిని అదుపు చేయాలంటే ఐటీ విధానంలో మార్పులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+