ప్రపంచంలో ది బెస్ట్ అండ్ సేఫెస్ట్ విమానాలు ఇవే: ఎయిరిండియా మరక

Top 10 best airlines in the world: అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా అంటే ప్రయాణికులకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఆ విషాదకర ఘటన తర్వాత కూడా పలు ఎయిరిండియా విమానాలు సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు కూడా లేకపోలేదు.

ఈ పరిణామాల మధ్య ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఎయిర్ లైన్స్ ఏవి అనే చర్చ మొదలైంది. దీనిపై స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ సంస్థ ర్యాంకింగులను ప్రకటించింది. 2025 ఎడిషన్ కు సంబంధించిన ర్యాంకులు ఇవి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసుల ఆధారంగా స్కైట్రాక్స్ సంస్థ ఈ ర్యాంకింగులను విడుదల చేసింది.

10 Best airlines in the world Qatar Airways remain in Top

విమానాల్లో సౌకర్యం, సమయపాలన, మెరుగైన సేవలు, సీట్ల మధ్య దూరం, ప్రయాణ సమయంలో అందించే భోజనం, ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. వివిధ దేశాలకు సంబంధించిన ప్రయాణికుల నుంచి ఓటింగ్ రూపంలో ఆ సంస్థ ఫీడ్ బ్యాక్ ను సేకరించింది.

అంతర్జాతీయంగా పౌర విమానయాన సంస్థలు తమ ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవడానికి, తాము కల్పించే సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులు సంతృప్తిగా ఉన్నారా? లేదా అనే విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ ర్యాంకింగ్స్ ఉపయోగపడతాయని స్కైట్రాక్ వరల్డ్ సంస్థ అభిప్రాయపడింది.

ఈ ర్యాంకింగ్ లల్లో ఖతార్ ఎయిర్‌వేస్ టాప్ పొజీషన్ లో నిలిచింది. ఈ ర్యాంకింగుల్లో ఈ ఎయిర్ లైన్స్ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది తొమ్మిదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పౌర విమానయాన సంస్థల ర్యాంకింగ్స్ లల్లో ఇదో సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు.

తొమ్మిదోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా నిలిచింది ఖతార్ ఎయిర్ వేస్. భారతీయ విమానయాన సంస్థలు ఏవీ కూడా ఈ సంవత్సరం ప్రపంచంలోని టాప్ 10 జాబితాలో చోటు సంపాదించలేకపోయాయి. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఎయిరిండియా కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

2025లో టాప్-10లో నిలిచిన విమానయాన సంస్థల జాబితా.. అవి ఏర్పాటైన సంవత్సరం

1. ఖతార్ ఎయిర్‌వేస్- నవంబర్ 1993

2. సింగపూర్ ఎయిర్‌లైన్స్- జనవరి 1972

3. క్యాథే పసిఫిక్- సెప్టెంబర్ 1946

4. ఎమిరేట్స్- మార్చి 1985

5. ANA ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్- డిసెంబర్ 1952

6. టర్కిష్ ఎయిర్‌లైన్స్- మే 1933

7. కొరియన్ ఎయిర్- మార్చి 1969

8. ఎయిర్ ఫ్రాన్స్- అక్టోబర్ 1933

9. జపాన్ ఎయిర్‌లైన్స్- ఆగస్టు 1951

10. హైనాన్ ఎయిర్‌లైన్స్- అక్టోబర్ 1989

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+