Girl: అమ్మాయి ఒంటరిగా చిక్కిందని అబ్బాయి ఏం చేశాడంటే ?, సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్ !, ఈ వయసులో ?
లక్నో/చెన్నై: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్బాయి, అమ్మాయి (ఇద్దరూ మైనర్లు) చనువుగా ఉంటున్నారు. బైక్ మీద తిరుగుతున్న అబ్బాయి అమ్మాయి ముందు ఫోజులు కొడుతున్నాడు. అమ్మాయి మీద మనుసు పారేసుకున్న అబ్బాయి ఎలాగైనా ఆమెను అనుభవించాలని స్కెచ్ వేశాడు. అమ్మాయి ఇంట్లో ఎవ్వరూ లేని విషయం తెలుసుకున్న అబ్బాయి ఆమె ఇంటికి వెళ్లాడు. అమ్మాయి మీద అత్యాచారం చెయ్యడానికి ఆ కామాంధుడు విఫలయత్నం చేశాడు. అమ్మాయి ఎదురుతిరగడంతో చేతికి చిక్కిన వస్తువులు తీసుకుని ఆమెను చితకబాదేశాడు. దెబ్బలు తట్టుకోలేని ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది, అమ్మాయి చనిపోయిందని అనుకున్న అబ్బాయి అతని బైక్ లో పరారైనాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓకే ఏరియాలో నివాసం
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాలోని మజోలా పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల అమ్మాయి, మరో మైనర్ అబ్బాయి నివాసం ఉంటున్నారు. అమ్మాయి, అబ్బాయి ఒకే ప్రాంతంలో నివాసం ఉండటంతో ప్రతిరోజు వాళ్లు సాటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ప్రతిరోజూ అమ్మాయి, అబ్బాయి కలుసుకుని మాట్లాడుకుంటున్నారు.

బిడ్డకు హీరో ఫోజులు ఎక్కువే
మైనర్ అబ్బాయి అతని తండ్రి బైక్ మీద తిరుగుతున్నాడు. బైక్ లో తిరుగుతున్న ఆ అబ్బాయి అమ్మాయిల మీద హీరోలాగా ఫోజులు కొడుతున్నాడు. అమ్మాయితో రాసుకుని పూసుకుని తిరుగుతున్న బాలుడు ఆమెను అనుభవించాలని రగిలిపోయాడు. ఇద్దరూ మైనర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

ఈ వయసులోనే ఏం స్కెచ్ వేశాడు ?
శుక్రవారం అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం గుర్తించిన అబ్బాయి ఆమె దగ్గరకు వెళ్లాడు. అమ్మాయితో చనువుగా ఉంటున్న సమయంలో ఆమె మీద చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కొంతసేపటికి అమ్మాయి బట్టలు చింపేసిన అతను అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మాయి ఎదురు తిరగడంతో అబ్బాయి సహనం కోల్పోయాడు.

ఎదురు తిరిగిందని ఏసేశాడు
ఎలాగైనా అమ్మాయిని అనుభవించాలని అనేక ప్రయత్నాలు చెయ్యడంతో ఆ అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ సందర్బంలో చేతికి చిక్కిన వస్తువులు తీసుకుని అతను అమ్మాయి తల, శరరీంలోని సున్నితమైన భాగాల మీద దాడి చేశాడు. దెబ్బలు తట్టుకోలేని ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది, అమ్మాయి చనిపోయిందని అనుకున్న అబ్బాయి అతని బైక్ లో పరారైనాడు.

సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్..... అమ్మాయి పరిస్థితి ?
అమ్మాయికి తీవ్రగాయాలైన విషయం గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కామాంధుడిపై కేసు
సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్దరప్రదేశ్ బాలల హక్కుల కమీషన్ చైర్మన్ డాక్టర్ విషేశ్ కుమార్ గుప్తా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అమ్మాయి మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేసి ఆమెను చంపేయడానికి ప్రయత్నించిన బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Recommended Video

ఇక అంతేనా ?
అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన బాలుడి మీద ఐపీఎస్ సెక్షన్ 376, 354 (A), 323, 354(B), 511 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశామని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఓ మైనర్ అమ్మాయి మీద ఓ మైనర్ అబ్బాయి అత్యాచారయత్నం చేసి తరువాత ఆమెను చంపడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications